పొగాకుతో కలిగే అనర్థాలపై అవగాహన పెంచాలి
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:18 AM
పొగాకు వినియోగంతో కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా వైద్యాధికారి రజిత సూచించారు.
ఇల్లంతకుంట, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : పొగాకు వినియోగంతో కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా వైద్యాధికారి రజిత సూచించారు. మండల కేంద్రంతో పాటు గాలిపెల్లి గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రులను గురువారం పరిశీలించి, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పొగాకు వాడటం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తులు, హృదయ సంబంధిత వ్యాధులు వస్తాయన్నారు. ప్రభుత్వ నియమాల ప్రకారం విద్యాసంస్థలకు 100మీటర్ల దూరంలో పోగాకు, పాను దుకాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇమ్యునైజేషన్ అధికారి సంపత్‌కుమార్, ప్రోగ్రాం అధికారులు రామకృష్ణ, అనిత, వైద్యాధికారులు జీవనజ్యోతి, కట్ట రమేష్, వీసీసీఎం మేనేజర్ నవీన, కవిత, భారతి, లక్ష్మి, సరిత, అనితలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.