‘స్టాప్ డయేరియా’పై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Jun 17 , 2025 | 11:47 PM
స్టాప్ డయోరియా కార్యక్రమంలో భాగంగా ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ అన్నారు.
సుభాష్‌నగర్, జూన్ 17(ఆంధ్రజ్యోతి): స్టాప్ డయోరియా కార్యక్రమంలో భాగంగా ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు, ఎంఎల్‌హెచ్‌పీలతో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి జూలై 31 వరకు స్టాప్ డయోరియా కార్యక్రమం జిల్లా అంతటా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఐదేళ్ల వయస్సు ఉన్న పిల్లలను గుర్తించి ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. విరేచనాల సమస్యను పరిష్కరించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో పిల్లలకు ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి రెండు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, 14 జింక్ మాత్రలను వయస్సుననుసరించి నిర్దేశించిన మోతాదు ప్రకారం అందజేయాలన్నారు. ఈ కార్యక్రమం వల్ల పిల్లల్లో వ్యాధి నిరోదకశక్తి పెరుగుతుందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సాదారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ సుధ, డీటీసీవో డాక్టర్ రవీందర్‌రెడ్డి, పీవోడీటీటీ డాక్టర్ ఉమాశ్రీ, డీఐవో డాక్టర్ సాజిద, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ చందు, పీవోఎన్‌సీడీ డాక్టర్ సనజవేరియా, పీవోఎన్‌సీడీ డాక్టర్ విప్లవశ్రీ, డెమో రాజగోపాల్, డీపీవో స్వామి, హెల్త్ ఎడ్యుకేటర్ కైక పాల్గొన్నారు.