అటవీ హక్కు చట్టంపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - May 15 , 2025 | 12:25 AM
అటవీ ఉత్పత్తులకు సంబంధించిన మొక్కలను నాటి గిరిజనులకు ఉపాధి కల్పించడంతో పాటు అటవీ హక్కు చట్టాలను అటవీ శాఖ అధికారులు వివరించేలా చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల సీనియర్ సివిల్ కోర్టు జడ్జి రాధిక జైస్వాల్ అన్నారు.
ఎల్లారెడ్డిపేట, మే 14 (ఆంధ్రజ్యోతి): అటవీ ఉత్పత్తులకు సంబంధించిన మొక్కలను నాటి గిరిజనులకు ఉపాధి కల్పించడంతో పాటు అటవీ హక్కు చట్టాలను అటవీ శాఖ అధికారులు వివరించేలా చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల సీనియర్ సివిల్ కోర్టు జడ్జి రాధిక జైస్వాల్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్ గ్రామ శివారులోని అర్బన్ పార్కును ఎఫ్‌ఆర్వో శ్రీహరిప్రసాద్‌తో కలిసి బుధవారం ఆమె సందర్శించారు. పార్కులో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను అటవీ శాఖ అధికారులు వివరించారు. పార్కులోని పలు ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ రాధిక జైస్వాల్ మాట్లాడుతూ సందర్శకులకు ఆహ్లాదం పంచేందుకు పార్కును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అటవీ ఉత్పత్తులకు సంబంధించిన మొక్కలను పెంచి ఉపాధి కల్పించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవి ధ్యం కాపాడాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కేంద్రంలో లభించే ఉచి త న్యాయ సలహాలు, సూచనలను వినియోగించుకునేలా గిరిజనులకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, ఆడేపు వేణు, గుర్రం ఆంజనేయులు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.