Share News

అంగన్‌వాడీల్లో సేవలపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:27 AM

అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే అన్ని సేవ లపై విస్తృత ప్రచారం కల్పించాలని మహి ళా, శిశుసంక్షేమశాఖ కార్యదర్శి అనిత రామ చంద్రన్‌ ఆదేశించారు.

అంగన్‌వాడీల్లో సేవలపై అవగాహన కల్పించాలి

సిరిసిల్ల, నవంబరు 12 (ఆంధ్ర జ్యోతి) : అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే అన్ని సేవ లపై విస్తృత ప్రచారం కల్పించాలని మహి ళా, శిశుసంక్షేమశాఖ కార్యదర్శి అనిత రామ చంద్రన్‌ ఆదేశించారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌తో కలిసి మహిళా, శిశు సంక్షేమ శాఖపై సంబంధిత అధికారులతో అనితరా మచంద్రన్‌ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పోషణలోపంతో బాధపడుతున్న వారి వివ రాలు అధికారుల నుంచి తెలుసుకున్నారు. పోషణలోపంతో బాధపడుతున్న వారికి అందించాల్సిన సేవల గురించి అందుతున్న సేవల స్థితిగతులపై ఆరా తీశారు. అలాగే ప్రభుత్వం తరపున అందిస్తున్న ఆహార పదార్థాలు సక్రమంగా చేరుతున్నాయా లేదా అనేది పరిశీలించారు. అలాగే సూపర్వైజర్లను అడిగి వారి సమస్యలపై ఆరా తీశారు. అంగన్‌వాడీలలో పిల్లల హాజ రు శాతం పెంచడానికి చేపట్టాల్సిన చర్యలపై వివరించారు. ప్రతి వారం ఎగ్‌బిర్యానీ పెట్టాలని ఆదేశించారు. గర్భిణులకు ప్రతి అంగన్‌ వాడీకి రెండు చొప్పున బెంచీలు అందిస్తున్నట్లు ప్రకటించారు. అలా గే పోషన్‌ ట్రాకర్‌, ఎన్‌హెచ్‌టిఎస్‌ యాప్‌లలో లబ్ధిదారుల సంఖ్యను పోల్చిచూసి పరిశీలించారు. సఖి ద్వారా అందుతున్న సేవలను తెలు సుకున్నారు. అలాగే అందరూ వారి కాళ్ల మీద వాళ్లు నిలబడడానికి అవసరమైన సహాయసహకారాలు అందించడానికి నైపుణ్య శిక్షణ ఇవ్వవలసిందిగా ఆదేశించారు. బాల్యవివాహాలు జరగకుండా గ్రామా ల్లో బేటీ బచావో బేటీ పడావో ద్వారా ప్రత్యేక కళాజాత కార్యక్రమా లు నిర్వహించాలని ఆదేశించారు. పని ప్రదేశంలో మహిళలపై లైంగి క వేధింపులపై ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా ఇంటర్నల్‌ కమి టీలను ఏర్పాటు చేయాలని, వారందరికీ చట్టంపైన శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దివ్యాంగులకు వయోవృద్ధులకు ఉపకరణాలు పరికరాలు అందిం చాలని సూచించారని తెలిపారు. ఎంతో శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రస్తుతం జరిగిన క్యాంపుల వివరాలను పరిశీలించి విజయవంతం కావడానికి కృషిచేసిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న డేకేర్‌ సెంటర్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులకు, వయోవృద్ధులందరికీ పరికరాలు అందించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమా న్ని సందర్శించి వారికి ఎలాంటి వసతులు అందుతున్నాయనే విష యాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌జేడి ఝాన్సీ, జిల్లా సంక్షేమ అధికారి పీ లక్ష్మీరాజం, సీడీపీవోలు ఉమారాణి, సౌం దర్య, డీహబ్‌ కోఆర్డినేటర్‌ రోజా, డీసీపీఓ కవిత, సఖి కోఆర్డినేటర్‌ మమత, పోషణ అభియాన్‌ కోఆర్డినేటర్‌ బాలకిషన్‌, సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:27 AM