Share News

అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:20 AM

జిల్లాలోని నిరక్షరాస్య వయోజన మహిళలకు అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఎం. హరిత అధికారులను అదేశించారు.

అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని నిరక్షరాస్య వయోజన మహిళలకు అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఎం. హరిత అధికారులను అదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం అండర్‌స్టాండింగ్‌ లైఫ్‌లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ సొసైటీ(ఉల్లాస్‌)పై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యాశాఖ, మెప్మా శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని నిరక్షారాస్య వయోజన మహిళలకు ఫౌండేషన్‌ లిటరసీ, బేసిక్‌ ఎడ్యూకేషన్‌ తదితర అం శాలపై అవగాహన అందించడం కార్యక్రమం ముఖ్యఉద్దేశ్యమన్నారు. వయో జనుల కోసం అక్షర వికాసం వలంటర్ల కోసం మార్గదర్శిని పుస్తకాలు ప్రభు త్వం జిల్లాకు పంపిణీ చేసిందన్నారు.అక్షర వికాసం పుస్తకాలు 21,894 రాగా, మార్గదర్శిని 2190పుస్తకాలు వచ్చాయన్నారు. ఈ సంవత్సరం జిల్లాలో 23387 మంది వయోజనులను గుర్తించామన్నారు. సమావేశంలో డీఅర్‌డీవో శేషాద్రి, అడిషనల్‌ డీఅర్‌డీవో శ్రీనివాస్‌, ట్రైనీడిప్యూటీ కలెక్టర్‌ నిఖిత, వయోజన విద్య శాఖ అధికారి అంజనేయులు, ఎంఈవోలు ఏపీఎంలు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 12:20 AM