Share News

సెమినార్లతో నిబంధనలపై అవగాహన

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:21 AM

జడ్జింగ్‌ సెమినార్లతో నిబంధనలపై అవగాహన వస్తుందని ఉషు అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాల మనోహర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఫండస్‌ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఉషు జడ్జింగ్‌ సెమినార్‌ను ఆదివారం నిర్వహించారు.

సెమినార్లతో నిబంధనలపై అవగాహన

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): జడ్జింగ్‌ సెమినార్లతో నిబంధనలపై అవగాహన వస్తుందని ఉషు అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాల మనోహర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఫండస్‌ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఉషు జడ్జింగ్‌ సెమినార్‌ను ఆదివారం నిర్వహించారు. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి 50 మందికిపైగా టెక్నికల్‌ అఫీషియల్స్‌ ఈ సెమినార్‌లో పాల్గొన్నారు. సెమినార్‌ను ప్రారంభించిన జాల మనోహర్‌ మాట్లాడుతూ క్రీడలో ఎప్పటికప్పుడు మారుతున్న నియమ నిబంధనలను తెలుసుకుని జడ్జింగ్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ఇలాంటి సెమినార్లు ఎంతగానో దోహదపడతాయన్నారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి హాజరైన టెక్నికల్‌ అఫీషియల్స్‌కు న్యాయనిర్ణేతలు వేసే పాయింట్ల విభజన, శిక్షణలో అవసరమున్న మెటీరియల్‌, వాటి వాడకం, తదితర విషయాలను వివరించారు. కార్యక్రమంలో ఉషు సంఘం రాష్ట్ర అఫీషియల్స్‌ మహ్మద్‌ ఇమ్రాన్‌, ఇర్ఫాన్‌, పరమేష్‌, అతిథులుగా ఫండస్‌ పాఠశాల చైర్మన్‌ గోపు ప్రభాకర్‌రెడ్డి, అసోసియేషన్‌ జిల్లా నాయకులు గోపు సుశాంక్‌రెడ్డి, బార విద్యాసాగర్‌, కోడూరి శేఖర్‌, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బి వేణుగోపాల్‌, పీడీ శంకరయ్య పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 12:21 AM