Share News

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - Jun 26 , 2025 | 12:15 AM

ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాధికజైస్వాల్‌ అన్నా రు.

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ఎల్లారెడ్డిపేట, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాధికజైస్వాల్‌ అన్నా రు. ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని బుధవారం ఆమె సందర్శించారు. ఆసుపత్రిలోని అందుతున్న వైద్య సేవలు, పరిసరాలను పరిశీలించారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారా..? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాధిక జైస్వాల్‌ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు చేరువలో న్యాయ సేవలు అందించడమే లక్ష్యంగా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తోందని పేర్కొన్నారు. లోక్‌ అదాలత్‌ సభ్యుడు చింతోజు భాస్కర్‌, ప్రముఖ వైద్యుడు సత్యనారాయణస్వామి తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 12:15 AM