చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:28 AM
చట్టపరంగా మహిళలకు సైతం సమాన హక్కులు ఉన్నాయని, ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పెంచుకో వాలని సిరిసిల్ల సివిల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ అన్నారు.

వేములవాడ, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి) : చట్టపరంగా మహిళలకు సైతం సమాన హక్కులు ఉన్నాయని, ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పెంచుకో వాలని సిరిసిల్ల సివిల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ అన్నారు. వేములవాడ పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసి మహిళల హక్కులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి వివిధ రకాల హక్కులు లభించాయని, ఇదే క్రమంలో మహిళలకు సమాన హక్కులు ఉన్నాయని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మహిళలు అవగాహన పెంచుకొని వాటిని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నారుల నుంచి మొదలుకొని ప్రతి ఒక్క రికి చట్టాలలో ఉన్న హక్కులు వాటిని సద్వినియోగం చేసుకునే అంశంపై ప్రతి ఒక్కరు తెలుసుకున్నప్పుడే న్యాయాన్ని పొందగలుగుతారని సూచించారు. న్యాయ స్థానం అందరికీ అందుబాటులో ఉండి సమాన హక్కులు కల్పిస్తుందని భావించా లన్నారు. మహిళలకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైనా, ఇతర సమస్యలు ఉన్న న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమను తాము కాపాడుకునే హక్కులు ఉన్నాయని వాటిని వివరించారు. విద్యావంతులుగా సమాజానికి అందుతున్న తరుణంలో ప్రతి విషయంపై అవగాహన పెంపొందించుకొని తమ వంతుగా సహాయాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాల సభ్యుడు చింతోజు భాస్కర్, సేవా సేవా సంస్థ సభ్యుడు కుమార్, న్యాయవాది రమేష్, ప్రిన్సిపాల్ కే లావణ్య, వైస్ ప్రిన్సిపాల్ సుమలత, ఉపాధ్యాయులు అధ్యాపకులు ఉన్నారు.