హామీల అమలు కోసం ఆటో డ్రైవర్ల భిక్షాటన
ABN , Publish Date - Jul 04 , 2025 | 01:01 AM
కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాజన్న సిరి సిల్ల జిల్లా కేంద్రంలో ప్యాసింజర్ ఆటో డ్రైవర్లు భిక్షాటన చేశారు.
సిరిసిల్ల టౌన్, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాజన్న సిరి సిల్ల జిల్లా కేంద్రంలో ప్యాసింజర్ ఆటో డ్రైవర్లు భిక్షాటన చేశారు. స్థానిక పాత బస్టాండ్ ఆటో స్టాండ్ వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోయి కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల నెలకొన్నాయన్నారు. మహాలక్ష్మి పథకం అమలైన నాటి నుంచి నేటివరకు దాదాపు 142మంది ప్యాసిం జర్ ఆటోడ్రైవర్లు ఉపాధి కరువై ఇంటి అద్దెలు, పిల్లలను చదవించుకోలేక, ఆటో ఫైనాన్స్ వారికి డబ్బులు చెల్లించలేక అప్పుల బాధతో ఇల్లు గడవని పరిస్థితులతో ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన ఆటోడ్రైవర్ల కుటుం బాలకు ప్రభుత్వం రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చేల్లించాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సంక్షేమానికి రూ.1000కోట్లు కేటాయించి సంక్షేమ బోర్టు కోటా యించాలన్నారు. మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోతున్నామని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో యూనియన్‌లో బంధుకు పిలుపునిస్తే ప్రభుత్వం దిగివచ్చి కొన్ని హామీలను ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18నెలులు పూర్తి అవు తున్న హామీలను అమలుచేయలేదన్నారు. ఆటో కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రభుత్వం కల్పించాలన్నారు. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్‌ను ప్రభుత్వం చెల్లించా లని ప్యాసింజర్ ఆటోడ్రైవర్లందరికి సంవత్సరానికి రూ.12వేలు కాకుండా రూ.15 వేల ఆర్థిక సహాయం అందించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలను ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్, ప్యాసింజర్ ఆటో యూనియన్ నాయకులు కన్కం శ్రీనివాస్, పులి నాగరాజు, సలీం, గాండ్ల శ్రీనివాస్, చింత విక్కి, మల్లా దేవరాజు, రేగుల రవి పాల్గొన్నారు.