Share News

అధిక ఫీజులు వసూలు చేస్తే దాడులు..

ABN , Publish Date - Jun 19 , 2025 | 12:42 AM

అధిక ఫీజులు వసూలు చేస్తే ప్రైవేటు విద్యా సంస్థలపై దాడులు చేస్తామని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు.

అధిక ఫీజులు వసూలు చేస్తే దాడులు..

సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): అధిక ఫీజులు వసూలు చేస్తే ప్రైవేటు విద్యా సంస్థలపై దాడులు చేస్తామని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. బుధవారం సిరిసి ల్ల పట్టణం కార్మిక భవనంలో విలేకరుల సమావేశంలో మణికంఠ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో గురుకులాలు, బెస్టు అవలేబుల్‌ స్కీమ్‌ పాఠశాలలు ప్రభుత్వం నిర్లక్ష్యంతో మూతబడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు బకాయిలు ఉన్నాయని, ప్రభుత్వం విడుదల చేయా లని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలలో రూ. 5లక్షల భరోసా కార్డు, ఎలక్ట్రిక్‌ స్కూటీలు ఇవ్వాలన్నారు. విద్యార్థుల బస్సు చార్టీలు పెంచడం సరి కాదని ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. విద్యారంగ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్ష చేసి ప్రభుత్వ విద్యాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారాని కి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శి టీలలో టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని త్వరగా భర్తీచేయాలన్నారు. గురుకులాలు, మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవీలో నాణ్యమైన ఆహారం అందించేలా కృషి చేయాలన్నారు. గురుకులాలో విద్యార్థులు లేరని సాకుతో ప్రభుత్వం 12 ఎస్సీ గురుకుల ఇంటర్‌ కళాశాలలను మూసివేసే నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. రాష్ట్రంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశా లలు, కళాశాలల గుర్తింపును రద్దుచేయాలని, నిబంధనలను పాటిం చని వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇంజనీరింగ్‌ కళాశాలల ఫీజులను ఎట్టి పరిస్థితుల్లో పెంచవద్దని బీ కేటగిరి సీట్లను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్న కళాశాలలను బ్లాక్‌ లిస్టులో పెట్టాలన్నారు. ఈ సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రాకేష్‌, కార్యదర్శి మంద అనిల్‌కుమార్‌, సహాయ కార్యదర్శి సొల్లు సాయి, మ నల రజనీకాంత్‌, మెతుకు అంజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 12:42 AM