Share News

ఏటీసీలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:47 AM

యువత ఏటీసీ సెంటర్‌లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా కోరారు.

ఏటీసీలను సద్వినియోగం చేసుకోవాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : యువత ఏటీసీ సెంటర్‌లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా కోరారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బుధవారం తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని ఏటీసీ సెంట ర్‌లో అడ్మిషన్‌లకు సంబంధించిన పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 2025-26, 2026-27 విద్యాసంవత్సరానికి ఐటీఐలలో అడ్మి షన్‌ల కోసం గుడువును ఈనెల 6వ తేదీనుంచి 28వ తేదీవరకు పొడిగించినట్లు తెలిపారు. ఐటీఐలో చేరాలనుకునే అభ్యర్థులు పదో తరగతి ఒరిజనల్‌ సర్టిఫికెట్‌ లతోపాటు కుల ధ్రువీకరణ, స్థానిక, కనీసం 6వ తరగతి వరకు తెలంగాణలో చదువుకున్న స్టడీ సర్టిఫికెట్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ఫొటోలతో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేం దర్‌, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ కవిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 12:47 AM