Share News

కలెక్టరేట్‌ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా

ABN , Publish Date - Dec 28 , 2025 | 12:38 AM

ఆశా వర్కర్‌లు చేసిన సర్వేలకు పెండింగ్‌ బకాయిలకు సం బంధించిన డబ్బులను ఇవ్వాలని సీఐ టీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, అశావర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్య క్షులు బాదవేణి మంజులలు డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా

సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ఆశా వర్కర్‌లు చేసిన సర్వేలకు పెండింగ్‌ బకాయిలకు సం బంధించిన డబ్బులను ఇవ్వాలని సీఐ టీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, అశావర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్య క్షులు బాదవేణి మంజులలు డిమాండ్‌ చేశారు. అలాగే సమస్యలను రాష్ట్ర ప్ర భుత్వం పరిష్కరించాలన్నారు. కలెక్టరే ట్‌ ఎదుట శనివారం సీఐటీయూ తె లంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో చేపట్టిన ధర్నాకు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లెప్రసీ సర్వేలు చేయాలని అన్ని జిల్లాల్లో ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశా ల మేరకు ఆశావర్కర్‌లు నిరంతరం సిద్ధంగా ఉన్నారని అన్నారు. వస్తున్న సమ్య ఏమిటంటే లెప్రసీ సర్వేకు అద నంగా డబ్బులు చెల్లిస్తామని ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదన్నారు. లెప్రసీ సర్వేలకు సంబంధిం చి సర్వేలకు ఇవ్వాల్సిన డబ్బులను చెల్లించాలంటూ పెద్ద పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ఆ పోరాటం ఫలితం గానే లెప్రసీ సర్వేకు అదనంగా డబ్బులు చెల్లిస్తామని అలాగే పెండింగ్‌ డబ్బులు చెల్లిస్తామని అధికారులు గతంలో హామీలు ఇచ్చారన్నారు. ఇప్పుడు దీనికి సంబం ధించి భిన్నంగా మళ్లీ సమస్యలను సృష్టించడంతో ఆశా వర్కర్‌లలో గందరగోళం నెలకొందన్నారు. ఆశావర్కర్‌లకు నేటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనం చెల్లించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం నేటికి ఫిక్స్‌డ్‌ వేతనం నిర్ణయం చేయలేదన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అశావర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జయశీల, కస్తూరి, లత, చంద్రకళ, లావణ్య, జ మున, గీత, స్రవంతి, తార, రేణుక, భూలక్ష్మీ పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 12:38 AM