భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:45 AM
మండలంలోని పెద్దాపూర్ గ్రామంలోని మల్లన్నస్వామి బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధి కారులకు ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశిం చారు.

- జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్
మెట్‌పల్లి రూరల్, మార్చి, 15 (ఆం ధ్రజ్యోతి): మండలంలోని పెద్దాపూర్ గ్రామంలోని మల్లన్నస్వామి బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధి కారులకు ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశిం చారు. శనివారం ఆలయం సందర్శించి పరిసరాలు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యాలు, అత్యవసర సేవలు, పోలీసు బందో బస్తు, తదితర అంశాలను పరిశీలిం చారు. జాతరకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత కల్పిం చడంలో పోలీసులు ఎల్లప్పుడు సిద్ధం గా ఉండాలన్నారు. ప్రతీ ఒక్కరు శాంతిభద్రతలు కాపాడేందుకు నిర్వహ కులు, గ్రామస్థులు సహకరించాలన్నా రు. ఏవైన అనుస్పద వస్తువులు, వ్యక్తు లు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించా రు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని, నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసు కోవాలని అధికారులకు పలు సూచన లు చేశారు. ఎస్పీ వెంట మెట్‌పల్లి డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ సురేష్, ఎస్‌ఐలు శ్రీకాంత్, శ్యామ్‌రాజ్, నవీన్, అదికారులు, సిబ్బంది, నాయకులు మిట్టపల్లి నారాయణరెడ్డి, కాటిపల్లి శ్రీని వాస్‌రెడ్డి పాల్గొన్నారు.