Share News

బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:04 AM

బతుకమ్మ, దసరా పండుగలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అధికారులను కోరారు. ఈమేరకు సోమవారం ఆయన మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు.

బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి
మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌కి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ, దసరా పండుగలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అధికారులను కోరారు. ఈమేరకు సోమవారం ఆయన మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పండుగలను పురస్కరించుకుని నగరంలోని అన్ని జంక్షన్లను రంగులరంగుల విద్యుద్దీపాలతో అలంకరించాలని, బతుకమ్మ ఘాట్ల వద్ద మైదానాన్ని శుభ్రం చేసి ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే మార్క్‌ఫెడ్‌ గ్రౌండ్‌, అంబేద్కర్‌ స్టేడియంలో గతంలో మాదిరిగానే బతుకమ్మ, దసరా ఉత్సవాలకు లైటింగ్‌, సౌండ్‌ సిస్టమ్‌, రామ్‌లీలా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టర్లకు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలన్నారు. సివిల్‌ తగాదాల్లో జోక్యం చేసుకోవద్దని మున్సిపల్‌ టీపీబీవోను హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వాల రమణారావు, జంగిలి అయిలేందర్‌యాదవ్‌, తోట రాములు, బోనాల శ్రీకాంత్‌, జంగిలి సాగర్‌, సుడా మాజీ డైరెక్టర్‌ నేతి రవివర్మ, నాయకులు ఎడ్ల అశోక్‌, గందె మహేశ్‌, సుధగోని కృష్ణగౌడ్‌, కోల సంపత్‌కుమార్‌, నందెల్లి మహిపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 12:04 AM