స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:55 PM
పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో, పోలీసు ప్రధాన కార్యాలయ మైదానంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.
జగిత్యాల, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో, పోలీసు ప్రధాన కార్యాలయ మైదానంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. దరూర్ క్యాంపులో గల పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరై జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. అనంతరం పోలీస్ పరేడ్, వంద స్వీకారం, ముఖ్య అతిథి సందేశం, సాతంత్య్ర సమరయోదులకు సత్కారం, వివిధ రంగాల్లో కృషి చేసిన వ్యక్తులకు ప్రశంసాపత్రాలను ప్రదానం చేయనున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, వందన సమర్పణ తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కలెక్టర్, ప్రజాప్రతినిధులు సందర్శించి పరిశీలన చేయనున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ సత్యప్రసాద్, కలెక్టర్ అశోక్ కుమార్ తదితరులు పర్యవేక్షించారు. కలెక్టరేట్ కార్యాలయం, ఆర్‌డీఓ కార్యాలయం, పోలీసు ప్రధాన కార్యాలయం తదితర వాటి వద్ద డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేశారు.