Share News

ఎంప్లాయిస్‌ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్మీ సంఘీభావ ర్యాలీ

ABN , Publish Date - May 12 , 2025 | 11:22 PM

పాకిస్తాన్‌పై యుద్దం చేస్తున్న భారత్‌ జవాన్లకు మద్దతుగా తెలంగాణ ఎంప్లాయిస్‌ జేఏసీ ఆద్వర్యంలో సంఘీభావ ర్యాలీని నిర్వహించారు.

ఎంప్లాయిస్‌ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్మీ సంఘీభావ ర్యాలీ
ర్యాలీలో ఉద్యోగులతో కలిసి పాల్గొన్న కలెక్టర్‌ పమేలా సత్పతి

సుభాష్‌నగర్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): పాకిస్తాన్‌పై యుద్దం చేస్తున్న భారత్‌ జవాన్లకు మద్దతుగా తెలంగాణ ఎంప్లాయిస్‌ జేఏసీ ఆద్వర్యంలో సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి అమరవీరుల స్థూపం వరకు నిర్వహించిన ఈ ర్యాలీని కలెక్టర్‌ పమేలాసత్పతి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్‌ దారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్‌ ఉగ్రవాదులు అమాయక భారత ప్రజలను చంపివేయడం అమానుష చర్య అని అన్నారు. ఆపరేషన్‌ సింధూరంతో ఉగ్రవాదుల స్థావరాలను, ఉగ్రవాదులను మట్టికరిపించారని అన్నారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్‌ మడిపల్లి కాళీచరణ్‌, అదనపు కలెక్టర్లు ప్రఫుల్‌దేశాయ్‌, లక్ష్మికిరణ్‌, సుప్రియ, సరస్వతి, రామకృష్ణ, పవన్‌కుమార్‌, శ్రీనివాస్‌, జనార్దన్‌రావు, ఏసీపీ వెంకటస్వామి, సీఐలు సృజన్‌రెడ్డి, కోటేశ్వరరావు, కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, అసోసియేట్‌ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2025 | 11:22 PM