Share News

ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారా..?

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:45 AM

ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారా.. ఎలా చదువుతున్నారు.. అంటూ పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు నిరుద్యో గులతో కాసేపు ముచ్చటించారు.

ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారా..?

సిరిసిల్ల, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారా.. ఎలా చదువుతున్నారు.. అంటూ పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు నిరుద్యో గులతో కాసేపు ముచ్చటించారు. బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా సినారే జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణతో పాటు కాంగ్రెస్‌ నాయకులు హనుమంతరావు సన్మానించారు. గ్రంథాలయంలో వివిధ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతీ యువకులతో మాట్లాడారు. గ్రంథాలయంలో కావాల్సిన పుస్తకాలు సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత లైబ్రరీ ముందు ఏర్పాటు చేస్తున్న జ్యోతిబాఫూలే విగ్ర హ పనులను పరిశీలించారు. వెంట టీపీసీసీ కో ఆర్డినేటర్‌ సంగీతం శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ వెల్ముల స్వరూపరెడ్డి, టీపీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, ఎస్‌సీ సెల్‌ జిల్లా ఆధ్యక్షుడు అకునూరి బాలరాజు, కాంగ్రెస్‌ పార్టీ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, పట్టణ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు బొప్ప దేవ య్య, మాజీ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 12:45 AM