Share News

రేపు జీపీవోలకు నియామక పత్రాలు జారీ

ABN , Publish Date - Sep 04 , 2025 | 01:17 AM

గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారుల పరీక్షలు రాసి ఉత్తీర్ణతను సాధించిన అభ్యర్థులకు ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందిస్తారని సీసీఎల్‌ఏ లోకేష్‌కుమార్‌ వెల్లడించారు.

రేపు జీపీవోలకు నియామక పత్రాలు జారీ

సిరిసిల్ల కలెక్టరేట్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారుల పరీక్షలు రాసి ఉత్తీర్ణతను సాధించిన అభ్యర్థులకు ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందిస్తారని సీసీఎల్‌ఏ లోకేష్‌కుమార్‌ వెల్లడించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో హైద రాబాద్‌ నుంచి సీసీఎల్‌ఏ లోకేష్‌కుమార్‌ మాట్లాడుతూ భూభారతి చట్టం అమలులో భాగంగా జీపీవోలను నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పరీక్షలను నిర్వహించిందన్నారు. ఇందులో భాగంగా ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈనెల 5వ తేదీన మంత్రులతో కలిసి సీఎం నియామక పత్రాలను అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో పరీ క్షలు రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సమాచారం అందించాలన్నారు. వారిని హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. జిల్లా నుంచి ప్రత్యేక బస్సును ఏర్పాటుచేసి నిర్ణీత సమయాని కి వచ్చేలా తరలించాలన్నారు. వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదే శించారు. నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని జిల్లా మంత్రులు, ప్రభుత్వ విఫ్‌లు, ఎమ్మెల్యేలకు ఇవ్వాలన్నారు.

తగిన ఏర్పాట్లు చేయాలి

జిల్లా నుంచి జీపీవో పరీక్షలు రాసి 66మంది ఉత్తీర్ణత సాధించారని కలె క్టర్‌ సందీప్‌కుమార్‌ఝా వెల్లడించారు. అభ్యర్థుఽలను ఈనెల 5వ తేదీన కలెక్టరేట్‌ నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధి కారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ను నోడల్‌ అధికారిగా నియమించామని తెలిపారు. హైదరాబాద్‌ తరలివెళ్లే అభ్యర్థులకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్‌ ఏవో రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2025 | 01:17 AM