మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - May 13 , 2025 | 11:56 PM
జిల్లాలోని మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో విద్యా ర్థులను ఆహ్వానిస్తూ రూపొందించిన పోస్టర్‌లను మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆవిష్కరించారు.
సిరిసిల్ల, మే 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో విద్యా ర్థులను ఆహ్వానిస్తూ రూపొందించిన పోస్టర్‌లను మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. అర్హు లైన విద్యార్థులు మైనార్టీ గురుకులాల్లో చేరాలని, సిరిసిల్ల, వేములవాడలో మైనార్టీ గురుకుల సంస్థల్లో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తరగతులు కొనసా గుతున్నాయని కలెక్టర్ వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం 5వ తరగతిలో 60 సీట్లు, 6 నుంచి 8వ తరగతి వరకు బ్యాక్‌లాగ్ సీట్లు సిరిసిల్ల విద్యాసంస్థలో ఇంటర్ ఫస్టియర్ 80 సీట్లు, వేములవాడలో ఎంఎల్‌టీ 30 సీట్లు, డెయిరీ టెక్నాలజీ కోర్సుల్లో 40 సీట్లు ఉన్నాయని తెలిపారు. అడ్మిషన్, ఇతర వివరాలకు 7995057908, 733117 0865 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల జిల్లా ఇన్‌చార్జి భారతి, ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయ ణ, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.