ఎన్‌సీడీ ప్రోగ్రాం నుంచి ఏఎన్‌ఎంలను మినహాయించాలి
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:00 AM
నాన్ కమ్యూనికబుల్ డిసీజ్(ఎన్‌సీడీ) ప్రోగ్రాం నిర్వహణకు ఏఎన్‌ఎంలను మినహాయించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్ డిమాండ్ చేశారు. సోమవారం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
సుభాష్‌నగర్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): నాన్ కమ్యూనికబుల్ డిసీజ్(ఎన్‌సీడీ) ప్రోగ్రాం నిర్వహణకు ఏఎన్‌ఎంలను మినహాయించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్ డిమాండ్ చేశారు. సోమవారం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్‌సీడీ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు పాల్గొని స్త్ర్కీనింగ్ టెస్టులతోపాటు ఆఫ్‌లైన్‌లో రిపోర్టులను రెండుసార్లు తయారు చేశారని తెలిపారు. మళ్లీ ఆఫ్‌లైన్‌తోపాటు, ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. ఆన్‌లైన్ చేయాలంటే ఓటీపీ అవసరమని, ఓటీపీ అడిగితే ప్రజలు ఏఎన్‌ఎంలకు చెప్పే పరిస్థితి లేదని అన్నారు. ఇప్పటికే 42 యాప్స్ ఉన్నాయని, వాటితోనే ఏఎన్‌ఎంలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. రోజుకు 10 నుంచి 12 గంటలపాటు పని చేస్తున్నారన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు భారత సంపూర్ణ, ప్రధాన కార్యదర్శి స్వరూప, సంతోష, రజిత, మానస, రమాదేవి పాల్గొన్నారు.