అంగన్‌వాడీలకు 18 వేల వేతనం ఇవ్వాలి
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:34 AM
అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చి న హామీ ప్రకారం అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు 18 వేల రూపాయల వేతనం ఇవ్వాలని అంగన్‌వాడీ టీచర్స్, ఆయాల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణకుమారి అన్నారు.
వేములవాడ, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి) : అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చి న హామీ ప్రకారం అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు 18 వేల రూపాయల వేతనం ఇవ్వాలని అంగన్‌వాడీ టీచర్స్, ఆయాల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణకుమారి అన్నారు. వేములవాడ పట్టణంలోని గుమ్మి పుల్లయ్య భవనంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఐసీడీఎస్ 50 సంవత్సరాలు గా సేవలందిస్తోందన్నారు. గర్భిణులు, చిన్నారులకు పోషకాహారం, విద్యను అంది స్తున్న తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నెలకు 18వేల రూ పాయల వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ పొం దిన టీచర్లకు రెండు లక్షలు, ఆయాలకు లక్ష రూపాయలు బెనిఫిట్స్ రూపంలో ఇవ్వాల్సి ఉండగా అవి కూడా అందడం లేదన్నారు. సౌకర్యాలు పెంచి వేసవి సెల వులు ఇవ్వాలని, సమ్మె కాలంలో వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు చొప్పరి అంజలి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, కొమిరె మంజుల, అనసూర్య, కవిత, సుంకపాక పుష్ప, అయేషా, నస్రీన్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.