అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:21 AM
గర్భిణులు, బాలింతలు, పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాలను వినియోగించుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.
గంభీరావుపేట, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): గర్భిణులు, బాలింతలు, పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాలను వినియోగించుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. గంభీరావుపేటలో రూ.14 లక్షల నిధులతో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని శుక్రవారం ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించారు. అంగన్ వాడీ కేంద్రాల్లో చదివే విద్యార్థులకు కుట్టించిన యూనిఫాంలను, పోషకాహారం ఈ సందర్భంగా పంపిణీ చేశారు. ప్రతి చిన్నారి సమీప అంగన్‌వాడీ కేంద్రాల్లో చదవా లని, కేంద్రాల్లో అందించే కోడిగుడ్లు, బాలామృతం, అన్నం, ఇతర పోషకాహాకారాన్ని వారికి తినిపించాలని సూచించారు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు ఆటల్లో, చదువుల్లో రాణిస్తారన్నారు. పిల్లలు బడి బయట ఉండవద్దని, రోజు అంగన్‌వాడీ కేంద్రాలకు రావాలని, చేతులు శుభ్రం చేసుకుని తినాలని ఆడుకోవాలన్నారు. పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి, అంగన్‌వాడీ కేంద్రాల్లో 3నెలల పాటు పోషకాహా రం ఇవ్వాలన్నారు. గర్భిణులు, బాలింతలు మునగ ఆకు, నువ్వులు, ఇతర కూరగా యలు, కోడిగుడ్లు, పాలు ఆహారంలో బాగం చేసుకుంటే మందులు అవసరం లేద న్నారు. ప్రతి ఇంట్లో మహిళలు పోషకాహారం తీసుకోవాలని వారు ఆరోగ్యంగా ఉం టేనే కుటుంభం అంతా బాగుంటుందన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
మండల కేంద్రంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. ధాన్యం నిల్వలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఇప్పటిదాకా ఎన్ని క్వింటాళ్ల దాన్యం రైస్ మిల్లులకు తరలించారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీవో రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.