Share News

తొలగని ప్రతిష్టంభన..

ABN , Publish Date - Jul 30 , 2025 | 01:14 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై నెలకొన్న ప్రతిష్టం భనకు ఇంకా తెర పడలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం మంత్రులతో నిర్వహించిన కేబినెట్‌ సమా వేశంలో ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంటారని ఆశించారు.

తొలగని ప్రతిష్టంభన..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై నెలకొన్న ప్రతిష్టం భనకు ఇంకా తెర పడలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం మంత్రులతో నిర్వహించిన కేబినెట్‌ సమా వేశంలో ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంటారని ఆశించారు. కానీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిం చేందుకు కేంద్ర ప్రభుత్వంపై, రాష్ట్రపతిపై ఒత్తిడి తీసు కురావాలని నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. 2018లో తీసుకవచ్చిన పంచా యతీరాజ్‌ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ను మంత్రివర్గం నిర్ణయించింది. 10వ తేదీన ఆర్డినెన్స్‌ను తయారు చేసిన ప్రభుత్వం ఈనెల 14న గవర్నర్‌కు పంపించారు. అంతకు ముందు మార్చి 22న అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన రెండు బిల్లులను గనర్నర్‌కు పంపించగా ఆయన రాష్ట్రపతికి పంపించారు. వీటిపై ఇంకా ఏ నిర్ణయం వెలువడలేదు. ఈ బిల్లును గవర్నర్‌ రాష్ట్రపతికి పంపించారని చెబుతున్నారు. దీనిపై ఆమో దం తెలిపేందుకు ఒత్తిడి తీసుకరావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 5న కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలతో పార్లమెంట్‌ ఉభయసభల్లో వాయిదా తీర్మానాలు ఇవ్వా లని క్యాబినెట్‌ నిర్ణయించింది. 6వ తేదీన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతి నిధులందరితో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించి జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. 7వ తేదీన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, 200 మంది ప్రజాప్రతినిధులతో కలిసి బిల్లుల ఆమోదం కోరుతూ వినతిపత్రం అందిం చాలని నిర్ణయించారు. ఇవన్నీ చేసినా రిజర్వేషన్ల బిల్లు లపై ఎలాంటి ఆమోదం లభించకపోతే సుప్రీం కోర్టు రూల్‌ ప్రకారం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలను నిర్వహించాల్సి వస్తుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెలాఖరు వరకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. బీసీల 42 శాతం రిజర్వేషన్ల బిల్లు కొలిక్కి రాకపోవడంతో ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.

ఫ అసహనానికి గురవుతున్న నాయకులు..

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పటికే ఆలస్యం అవుతున్నది. ఏడాదిన్నర కాలంగా గ్రామ పంచాయ తీల్లో, ఏడాది కాలంగా మండల, జిల్లా పరిషత్‌ల్లో, ఆరు నెలలుగా మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతున్నది. ఎన్నికలు జరగక పోవడంతో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయడం లేదు. దీంతో గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదు. నిర్వహణకు నిధులు లేక ప్రత్యేకాధికారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 13 జడ్పీటీసీ, 137 ఎంపీటీసీ స్థానాలు, 266 సర్పంచ్‌, 2,480 వార్డు స్థానాలకు, రామగుండం కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు కార్పొరేటర్లు, పెద్దపల్లి, మంథని, సుల్తా నాబాద్‌ మున్సిపాలిటీల్లో 64 వార్డుల కౌన్సిలర్లకు ఎన్ని కలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేం దుకు అనేక మంది నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీతోపాటు బీఆర్‌ఎస్‌, బీజేపీకి చెందిన నాయకులు రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తే పోటీ చేసేందుకు సన్నద్ధంగా ఉన్నారు. గత ఏడాది కాలంగా ఆశావహులు గ్రామాలు, పట్టణాల్లో ఓటర్లను ఆకర్శించేందుకు అనేక సామాజిక కార్యక్రమా లను నిర్వహిస్తున్నారు. అందరినీ పలకరిస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో వేలాది రూపా యలు వెచ్చిస్తున్నారు. పార్టీ టిక్కెట్లు దక్కించుకునేం దుకు నాయకులను కలుస్తున్నారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికార కాం గ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు మంత్రులు, ఎమ్మె ల్యేలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చినప్పు డు పోటాపోటీగా ప్లెక్సీలు కడుతున్నారు. సెప్టెంబర్‌ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయా లని హైకోర్టు ఆదేశించిన నాటి నుంచి నాయకులు తమ కార్యక్రమాలను మరింత వేగంగా చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కులగణన చేపట్టి అసెంబ్లీలో ఆమోదం తెలిపిన బిల్లులతోపాటు, ఆర్డినెన్స్‌ బిల్లును కూడా గవర్నర్‌కు అందించింది. ఈ బిల్లులపై రాష్ట్రపతి ఆమోదం కోసం కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఇప్పట్లో ఈ బిల్లుకు ఆమోదం లభించే అవకాశాలు లేవని తెలిసి నప్పటికీ, బంతిని కేంద్రం కోర్టులో వేసింది. ఒకవేళ ఆర్గినెన్స్‌కు ఆమోదం లభించకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేన్లు కల్పించి, రోటేషన్‌ ప్రకారం ఆయా స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వ హించే అవకాశాలున్నాయి. రిజర్వేషన్లపై జాప్యం జరుగుతుండడంతో స్థానిక సంస్థల నాయకులు అసహనానికి గురవుతున్నారు.

Updated Date - Jul 30 , 2025 | 01:14 AM