ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ..
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:35 AM
ప్రజావాణి లో విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని జిల్లా అధికారులను కలెక్ట ర్ సందీప్‌కుమార్‌ఝా అదేశించారు.

సిరిసిల్ల కలెక్టరేట్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి లో విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని జిల్లా అధికారులను కలెక్ట ర్ సందీప్‌కుమార్‌ఝా అదేశించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటుచే సిన ప్రజావాణిలో సమస్యలను చెప్పుకునేందుకు జిల్లా నలు మూల నుంచి ప్రజలు కలెక్టరేట్‌కు తరలిరావడంతో కిటకిట లాడిపోయింది. కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో సోమ వారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, డీఆర్‌డీవో శేషాద్రి, సిరిసిల్ల ఇన్‌చార్జ్ ఆర్డీవో అర్వీ రాధాబాయిలు పాల్గొని సమస్యలను విన్నవించేందుకు వచ్చి న ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రజావా ణిలో 153ధరఖాస్తులు, ఫిర్యాదులు రాగా ఇందులో రెవెన్యూ శాఖకు62, సిరిసిల్ల మున్సిపాల్టీకి 22, సెస్‌కు 3, ఉపాధి కల్ప నశాఖకు 11, భూగర్భశాఖకు 5, జిల్లా వైధ్యాధికారికి 3, వ్యవ సాయశాఖకు 2, ఎల్‌ఓండీకి 1, వేములవాడ దేవస్థానం ఈ వోకు1, జిల్లా పౌరసరఫరాల శాఖకు 2, జిల్లా సంక్షేమాధికారి కి 8, డీపీఅర్‌ఈకి 2, ఎస్డీసీకి 3, విద్యాశాఖకు 5, గంభీరావు పేట ఎంపీడీవోకు 3, ఎల్లారెడ్డిపేట ఎంపీడీవోకు 2, కోనరా వుపేట ఎంపీడీవోకు 2, చందుర్తి ఎంపీడీవోకు2, ఎస్సీ కార్పొ రేషన్‌కు 3, వేములవాడ మున్సిపాల్టీకి 2, వేములవాడ రూర ల్ ఎంపీడీవోకు 1, బోయినపల్లి ఎంపీడీవోకు1, తంగళ్లపల్లి ఎంపీడీవోకు1,ముస్తాబాద్ ఎంపీడీవోకు1, ఎస్పీ కార్యాలయా నికి 1, సీపీవోకు1, చేనేత జౌళీఽశాఖకు1, నీటిపారుదల శాఖ కు 1 చొప్పున వచ్చిన ఫిర్యాదులు వినతి పత్రాలు, అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి త్వరితగితన పరి ష్కారం చూపాపడంతోపాటు అర్జీదారులకు లిఖిత పూర్వ కంగా సమాచారం ఇవ్వలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.