Share News

ఓసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Dec 26 , 2025 | 12:07 AM

ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్ల అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఓసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.

ఓసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్ల అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఓసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రం పద్మనాయక కల్యాణ మం డపంలో 2026 జనవరి 11న హన్మకొండలో ఓసీల సింహగర్జన విజయవం తం చేయడం కోసం సన్నాహక సమావేశంలో వాల్‌పోస్టర్‌, కరపత్రాలను ఓసీ జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ 10శాతం ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లపై స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని దుష్టశక్తులు ఆయా కులాల్లోని ప్రజ లను భయపెడుతూ చేస్తున్న అసత్య ప్రచారాలను కుట్రలను సాగనివ్వబో మని, దీనిపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఓసీ జేఏసీ డిమాండ్ల ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు 2026 జనవరి 11న హన్మకొండ ఆర్ట్స్‌ కళాశాల క్రీడా మైదానంలో లక్ష మందితో సింహగర్జన బహిరంగ సభను నిర్వహిస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని ఓసీలు పెద్ద సంఖ్యలో పాల్గొని సింహగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామా రావు, ఓసీ జేఏసీ నాయకులు చెన్నమనేని పురుషోత్తంరావు, వనమాల ప్రభాకర్‌రెడ్డి, చేపూరి అశోక్‌, ఆల్‌ ఇండియా వెలమ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు తాండ్ర శ్రీనివాస్‌రావు, జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని కమలా కర్‌రావు, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రావు, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బుస్స దశరథం, ఓసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2025 | 12:07 AM