Share News

కోడెల అక్రమ రవాణాపై విచారణ జరిపించాలి

ABN , Publish Date - Jun 08 , 2025 | 12:36 AM

కోడెల అక్రమ రవా ణా వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

కోడెల అక్రమ రవాణాపై విచారణ జరిపించాలి

వేములవాడ, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి) : కోడెల అక్రమ రవా ణా వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం నాడు వారు వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్‌ను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి సుభాష్‌ నగర్‌లోని వధశాలకు ఆరు కోడెలు తీసుకరాగా, వీటిలో రెండిం టిని కాపాడామని, కోడెలు వధశాలకు తరలించిన వ్యవహారంపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ వీరప్రసాద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో రేగుల సంతోష్‌ బాబు, గడప కిషోర్‌ రావు, నాగుల రాము గౌడ్‌, రేగుల రాజ్‌ కుమార్‌, లక్ష్మణ్‌, మైలారం శ్రీనివాస్‌, నందగిరి రాహుల్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2025 | 12:36 AM