పశు కల్యాణ్ సమితిని ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:48 AM
నిబంధనల ప్రకారం పశు కల్యాణ్ సమితిని ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : నిబంధనల ప్రకారం పశు కల్యాణ్ సమితిని ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం పశుకల్యాణ్ సమితి ఏర్పాటుపై సంబంధిత అధికా రులతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెటర్నరీ ఆసుపత్రుల పర్యవేక్షణ, పశువుల సంక్షేమం నిమిత్తం పశుకల్యాణ్ సమితిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేయాలని నిర్ణ యిందన్నారు. పశు కల్యాణ్ సమితికి కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి కన్వీనర్‌గా ఏర్పాటు చేస్తారన్నారు. ఈ కమిటీలో ప్రతి గ్రామపంచాయతీ నుంచి డీపీవోను, అదే విధంగా జిల్లా పరిధిలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు ప్రతిపా దించిన 13 మండలాలకు చెందిన 13మంది సభ్యులను నియ మించాలని, పశుసంవర్థకశాఖ తరపున అధికారులను కమిటీలో భాగస్వామ్యం చేయాలన్నారు. జిల్లాలోని పశువుల ఆరోగ్యస్థితిగతులను మెరుగుపర్చడం, వెటర్నరీ ఆసుపత్రుల అభివృద్ధి,ఆధునికీకరణకు కృషి, పశు వైద్య కార్యక్రమాల నిర్వహణలో సహకారం, పశువైద్యంపై అవగా హన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజలను విస్తృతంగా పా లనలో భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా పశు కల్యాణ్ సమితి పని చేస్తుందన్నారు. జిల్లా స్థాయిలో పశుకల్యాణ్ సమితిలను సొసైటీ రిజి స్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేయాలని, ఎగ్జిక్యూటివ్ కమిటీ నియ మించాలని, మార్గదర్శకాలను టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ నోటిఫై చేయాలని అన్నారు. పశుకల్యాణ్ సమితి ఏర్పాటుకు సంబంధించి చేపట్టిన చర్య లు రిపోర్ట్‌ను జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి 15 రోజుల్లో ప్రధాన కార్యాలయానికి అందించాలన్నారు. వెటర్నరీ ఆసుపత్రుల నిర్మాణానికి అనువైన స్థలాలను, ఇతర వసతులను గుర్తించి ప్రతిపాదనలు తయా రుచేయాలన్నారు. సమావేశంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి షరీఫుద్దీన్ పాల్గొన్నారు.