అంబేద్కర్‌ను అవమానించిన అమిత్‌షా..
ABN , Publish Date - Jun 18 , 2025 | 01:02 AM
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించిన అమి త్‌షాకు మహిళలు బుద్ధి చెప్పాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి) : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించిన అమి త్‌షాకు మహిళలు బుద్ధి చెప్పాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు అన్నారు. జైభీమ్, జైమహాత్మా, జైసంవిధాన్‌లో భాగంగా మంగళవారం మహిళా కాంగ్రెస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక నేతన్నచౌక్ వద్ద పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశా రు. అనంతరం స్థానిక బీవైనగర్‌లో కాంగ్రెస్ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత అధ్యక్షతన జిల్లాస్థాయి సమావేశంకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర పర్య టనలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. రాజ్యాంగంలో మార్పులు తీసుకురాలని బీజేపీ ప్రభుత్వం దురు ద్దేశంతో ఉన్నారని ఆరోపించారు. దేశంలోని సామాన్యుల నడ్డి విరి చే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్, డీజీల్, పెట్రోల్ ధరలను పెంచుతూ పోతోందన్నారు. విద్యార్థుల పెన్సిల్స్ నుంచి చెప్పుల వరకు జీఎస్టీ వసూలు చేస్తుందని ఆరోపించారు. సామాన్య ప్రజలకు అండగా ఉండాలని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు, రూ. 500లకు వంట గ్యాస్ సిలిండర్‌ను ఇస్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చేప ట్టిందని పేదవారికి రేషన్ ద్వారా సన్న బియ్యం పథకంను అంది స్తుందన్నారు. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరలను పెంచుతూ చివరికి మహిళల చీరలపై జీఎస్టీ వేయ ుడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మాత్రం ధరలను తగ్గించి అధికారంలోకి రాగానే మల్లి ధరలను పెంచుతుం దని రానున్న రోజుల్లో బీజేపీని ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. సోనియాగాంధీ బంగారు తెలంగాణను ఇస్తే బందిపోట్ల రాష్ట్ర సమి తి(బీఆర్‌ఎస్)పది సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దోచు కుందని ఆరోపించారు. బీఆర్‌ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని రెండు పార్టీలు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలాగా మార్చాయని ఆరోపించారు. కాళ్లేశ్వరం ప్రాజక్టు నిర్మాణంలో అవినీ తికి పాల్పడిన కేసీఆర్, కేటీఆర్‌కు బుద్ధి చెప్పడానికి సమయం వ చ్చిందని ఈడీ, ఏసీబీ కోర్టుల చుట్టు తిరుగుతున్నారని ఆరోపించా రు. గత బీఆర్‌ఎస్ పది సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ఉద్యోగాల భర్తిచేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్ర భుత్వ వచ్చాకే రేషన్‌కార్డులు, సన్నబియ్యం పంపిణీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ను అమలు చేస్తుందని రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇవ్వడంలో కొంచం ఆలస్యం అవుతుండవచ్చని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూ ముందుకు వెల్తున్నారని ప్రజలు గమనించాలని కోరారు. ప్రభుత్వం సిరిసిల్ల పవర్‌లూం కార్మికులకు 10శాతం నూలు సబ్సిడీ, రూ.5లక్షల వరకు ముద్ర రు ణాలు, ప్రభుత్వం నుంచి ఆర్డర్లు ఇస్తూ కార్మికులకు ఉపాధి, నేతన్న ల బీమా, మగ్గం శిక్షణలు ఇస్తూ పరిశ్రమలను కార్మికులను ప్రోత్స హిస్తోందన్నారు. అనంతరం పట్టణంలో ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారు ల భూమిపూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, బ్లాక్ అధ్యక్షురాలు రమాదేవి, పట్ట ణ అధ్యక్షురాలు స్వరూప, నాయకురాల్లు మడుపు శ్రీదేవి, రోజా, పద్మ, రుక్మిణి, లహరి, హారిక, వనిత, రాజ్యలక్ష్మి, జ్యోతి, జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.