Share News

అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగించాలి

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:47 AM

అంబే ద్కర్‌ ఆశయాలను కొనసాగించడానికి యువత ముం దుండాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగించాలి

కోనరావుపేట, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : అంబే ద్కర్‌ ఆశయాలను కొనసాగించడానికి యువత ముం దుండాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామంలో అంబేద్కర్‌ భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబే ద్కర్‌ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకు లకు శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్‌ ఆలోచన వి ధానం ముందుకు తీసుకుపోవాలని సూచించారు. బో ధించు.. సమీకరించు.. పోరాడు.. అంటూ అంబేద్కర్‌ సమాజంలో జరుగుతున్న వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజల కోసం రాజ్యాంగం రాసారని పే ర్కొన్నారు. వేములవాడ నియోజకవర్గాన్ని, కోనరావుపేట మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపా రు. మల్కపేట రిజర్వాయర్‌ మెయిన్‌ కెనాల్‌ ద్వారా ఎల్లారెడ్డిపేటలో సాగు నీరందించడం జరిగిందని తెలి పారు. ఎడమ కాలువ ద్వారా మారుపాక వరకు సాగు నీరు పంపిణీ చేయడం జరిగిందని, రానున్న వేసవి కాలం దృష్ట్యా ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసుకోవడం జరిగిందన్నారు. మండల పరిధిలో నాగారం, మంగళప ల్లి గ్రామాలకు రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. నూతన బ్రిడ్జిల నిర్మాణం చేపడుతామని తెలి పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఇందిర మ్మ రాజ్యంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. గ్రామాల్లో పే ద ప్రజలకు పక్క ఇల్లు ఉండాలని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయ డం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలను రద్దు చేయకుండా నూతన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని తెలిపారు. పల్లిమక్తలో గ్రామ పం చాయతీ భవనం నిర్మాణానికి నిధు లు మంజూరుచేస్తానని హామీ ఇ చ్చారు. కార్యక్రమంలో అంబేద్కర్‌ సంఘం నాయకులు, సర్పంచ్‌ జిన్న అనూష, అనిల్‌, శ్రీధర్‌, జాన్‌, సురేష్‌, విజయ్‌, కాంగ్రెస్‌ నాయకులు కేతిరెడ్డి జగన్మోహన్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కచ్చకాయల ఎల్లయ్య, మండల అధ్యక్షుడు ఫిరోజ్‌పాషా, వైస్‌ చైర్మన్‌ తాళ్లపల్లి ప్రభాకర్‌, డైరెక్టర్‌ నాయిని ప్రభాకర్‌రెడ్డి,సాసాల రాజు, నీరటి సం జీవ్‌, ఉప్పుల గంగయ్య, సుంకరి రెడ్డి, అవురం సురేష్‌, వాసంపల్లి శ్రీనివాస్‌, ప్రభాకర్‌, మల్లేశం, పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 12:47 AM