ఎర్రజెండా పార్టీలన్నీ ఏకంకావాలి
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:32 AM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగడాలను ఎండగట్టాలంటే దేశంలోని ఎర్రజెండా పార్టీలన్నీ ఏకం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంక టరెడ్డి అన్నారు.
సిరిసిల్ల టౌన్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగడాలను ఎండగట్టాలంటే దేశంలోని ఎర్రజెండా పార్టీలన్నీ ఏకం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంక టరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా చాడ వెంక టరెడ్డి హాజరయ్యారు. ముందుగా బద్దం ఎల్లారెడ్డి వర్ధం తి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలతో నాయ కులు నివాళులర్పించారు. సీపీఐ జిల్లా కౌన్సిల్ సమా వేశం అనంతరం విలేకరుల సమావేశంలో చాడ వెంక టరెడ్డి మాట్లాడారు. దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని పునా దులతో సహా పెకిలించాలని చూస్తోందన్నారు. అందు లో భాగంగా మొట్టమొదట మావోయిస్టులపై అపరేషన్ కగార్‌ను ప్రయోగించిందని ఆరోపించారు. సాంకేతి పరి జ్ఞానం ఉపయోగించుకుంటూ మావోయిస్టులపై అమీత్ షా దాడులు, ఎన్‌కౌంటర్లు చేయిస్తున్నాడని అన్నారు. అర్బన్ నక్సలైట్లు అంటూ మరో విద్వేశాలను సృష్టిస్తుం టే ప్రశ్నించే గొంతుకులను నొక్కేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. దేశ సంపదను ప్రజలందరికి పంచాలని బీఆర్‌ఎస్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కమ్యూనిస్టుల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. దేశంలోని అన్ని రంగాలు మోదీ పాలనలో కార్పొరేట్ చేతులోకి పోయిందని అన్నారు. మహాత్మగాంధీ జాతీ య ఉపాధిహామీ పథకం పేరులో మహాత్మగాంధీ పేరు ఎందుకు తీసివేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు జరుగు తున్నాయని ఆరోపించారు. జాతీయ ఉపాధి పథకాన్ని కొనసాగిస్తూ 90 శాతం కేంద్రం 10 శాతం రాష్ట్ర ప్రభు త్వాలు నిధులు భరించాలని అన్నారు. బీజేపీ దేశంలో మరోసారి అధికారంలోకి వచ్చి అధ్యక్ష పాలన తీసుకురా వాలని కుట్రలు జరుగుతున్నాయని మతోన్మాద నియం త్రుత్వ బాసిస్టుశక్తులను ఓడించాలంటే ఇండియా కూటమి ఇంకా బలపడాలని కాంగ్రెస్‌పార్టీ ప్రధాన పాత్రను పోషించాలన్నారు. ఇండియా కూటమి ఏకమై ప్రజలను చైతన్య పరుస్తూ నరేంద్రమోది ప్రభుత్వ దుర్మార్గాన్ని ఎండగడుతూ రాను న్న రోజుల్లో బీజేపీని గద్దె దించా లన్నారు. సీపీఐ వంద సంవత్స రాల ఆవిర్భావ ఉత్సవాలను పుర స్కరించుకొని జనవరి 11న ముస్తాబాద్, సిరిసిల్లలో వివిధ కార్యక్రమాలు ఉంటాయని చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. జనవరి 18న ఖమ్మంలో జాతీయ స్థాయిలో ముగింపు సభ ఏర్పాటు చేస్తున్నామని 40 దేశాల ప్రతినిధులు, ఐదు లక్షల మంది జనాలతో సభ నిర్వహించడానికి ఏర్పాటు జరుగుతున్నాయన్నారు. అదే విఽధంగా ముగింపు సభకు ముందు 15వేల జనసేవాదల్ కార్యకర్తలతో ఖమ్మంలో కవాతు కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకుడు కల వేణి శంకరన్న, జిల్లా, పట్టణ నాయకులు, సీపీఐ, ఏఐటీ యూసీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యక ర్తలు పాల్గొన్నారు.