Share News

దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి

ABN , Publish Date - May 10 , 2025 | 11:31 PM

దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని, జాతీయతను చాటాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం నగరంలోని మార్కెట్‌రోడ్‌ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి
ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ టౌన్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని, జాతీయతను చాటాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం నగరంలోని మార్కెట్‌రోడ్‌ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారత సైనికులకు మద్దతుగా కరీంనగర్‌ గోవిందపతి సేవా సంస్థ, శ్రీసేవామార్గ్‌ సంస్థ, నగర కమిటీ మహిళా ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో వినూత్నంగా సిందూరంతో కూడిన చేతిముద్రలను తెల్లటి వస్త్రంపై ఉంచి భారత ప్రభుత్వానికి పంపించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. అనంతరం నగరంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్ధంలో వీరమరణం పొందిన మురళి నాయక్‌ ఆత్మకు శాంతి కలగాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచనతో తన ఒక నెల వేతనాన్ని ఇండియన్‌ ఆర్మీకి పంపించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన చెక్కును త్వరలోనే కలెక్టర్‌కు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీసేవామార్గ్‌ సంస్థ అధ్యక్షురాలు మునిపల్లి ఫణీత, గోవిందపతి ఎవారి సేవా సంస్థ ఫౌండర్‌ చైర్మన్‌ పాలవేడు శ్రీనివాస్‌, పడకంటి ఇందు, నకిరే కొమ్ముల పద్మ, సరళ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 11:31 PM