Share News

మద్యం అమ్మకాలను నియంత్రించాలి

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:50 PM

జిల్లాలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న బెల్ట్‌ షాపుతోపాటు వాటికి మద్యం సరఫరాచేస్తున్న వైస్స్‌లపై చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్‌టీయూ న్యూ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు సొమిశెట్టి దశరథం డిమాండ్‌ చేశారు.

మద్యం అమ్మకాలను నియంత్రించాలి

సిరిసిల్ల రూరల్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న బెల్ట్‌ షాపుతోపాటు వాటికి మద్యం సరఫరాచేస్తున్న వైస్స్‌లపై చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్‌టీయూ న్యూ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు సొమిశెట్టి దశరథం డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని ఎక్సైజ్‌ సీఐ కార్యాయలం ఎదుట మంగళవారం ఏఐఎఫ్‌టీయూ(న్యూ), పీవోడబ్ల్యూ, ఎర్ర జెండా బీడీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సంద ర్భంగా దశరథం మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్స హిస్తూ చీప్‌ లిక్కర్‌ రాష్ట్రంగా మార్చిందని ఆరో పించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం బెల్ట్‌ షాపులను నిషేఽధించి, మద్యం అమ్మకాలపై ని యంత్రణ కొనసాగించి మద్యపాన రహిత రాష్ట్రం గా తీర్చిదిద్దామని హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పకైనా ప్రభు త్వం మద్యం పర్మిట్‌ రూములను నియంత్రించి బెల్టుషాపులపై చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమం లో తెలంగాణ రైతు కూలి సంఘం రాష్ట్ర కోశాధి కారి భామనుల రవీందర్‌, ఎర్రజెండా బీడీకార్మిక సంఘం జిల్లా కన్వీనర్‌ మచ్చ అనసూర్య, పెద్దోళ్ల సంగీత, జక్కని త్రివేణి, గుజ్జె దేవాదాసు, సత్త య్య,పంతం సుజాత, గడదాస్‌ లత పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2025 | 11:50 PM