Share News

విద్యార్థులకు ఉపయోగకరంగా ఏఐ టెక్నాలజీ

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:36 AM

ఏఐ టెక్నాలజీ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. శనివారం కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌నగర్‌లో కంప్యూటర్‌ ల్యాబ్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 18 పాఠశాలలను కంప్యూటర్‌ ల్యాబ్‌ల ప్రారంభానికి ఎంపిక చేశామన్నారు.

విద్యార్థులకు ఉపయోగకరంగా ఏఐ టెక్నాలజీ

భగత్‌నగర్‌, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ఏఐ టెక్నాలజీ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. శనివారం కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌నగర్‌లో కంప్యూటర్‌ ల్యాబ్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 18 పాఠశాలలను కంప్యూటర్‌ ల్యాబ్‌ల ప్రారంభానికి ఎంపిక చేశామన్నారు. పలు సబ్జెక్టుల్లో వెనుబడిన 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఏఐ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఏఐలో ఉన్న విషయ పరిజ్ఞానంతో విద్యార్థులకు చక్కటి అవగామన వస్తుందన్నారు. తక్కువ సమయంలో ప్రత్యక్షంగా విద్యార్థులు విషయాన్ని నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. ఏఐ టెక్నాలజీ ద్వారా విద్యార్థుల పరిజ్ఞానాన్ని అంచనా వేసి సాఫ్ట్‌వేర్‌ బోధన అంశాలను నేర్పుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్ధన్‌, కో-ఆర్డినేటర్‌ అశోక్‌రెడ్డి, ఎంఈఓ ఆనందం, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

విద్యతో లక్ష్యాన్ని సాధించవచ్చు

- జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి

తిమ్మాపూర్‌ : విద్యతో అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి విద్యార్ధులకు సూచించారు. శనివారం కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అలుగునూర్‌లో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభ కేంద్రంలో చదువుతున్న విద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. దృష్టి లోపం ఉన్న 72 మంది విద్యార్ధులను గుర్తించి వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి హాజరై విద్యార్ధులకు అద్దాలు పంపిణీ చేసి మాట్లాడారు. పాఠశాలలో అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. అర్థం కాని విషయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి షాజిత, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుజాత, ప్రోగ్రాం ఆఫీసర్‌ సనా, ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 12:36 AM