Share News

వ్యవసాయ శాఖ ‘పల్లెబాట’

ABN , Publish Date - Sep 03 , 2025 | 01:08 AM

వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారులు మరోసారి పల్లె బాట పట్టారు. నైరుతి రుతుపవనాలు ఖరీఫ్‌ సాగు ప్రారంభంలోనే ఆశలు పెంచి ముఖం చాటేశాయి.

వ్యవసాయ శాఖ ‘పల్లెబాట’

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారులు మరోసారి పల్లె బాట పట్టారు. నైరుతి రుతుపవనాలు ఖరీఫ్‌ సాగు ప్రారంభంలోనే ఆశలు పెంచి ముఖం చాటేశాయి. కాస్త ఆలస్యంగా పునాస సాగు మొదలైంది. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు ఖరీఫ్‌ పంటలు చేతికి వస్తాయనే ధీమాతో ఉన్నారు. ఖరీఫ్‌ వరి నాట్లు, ఇతర పంటల విత్తనాలు వేసుకోవడం పూర్తి కావడంతో వ్యవసాయ అధికారులు జిల్లాలో క్రాప్‌ బుకింగ్‌ సర్వే ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా నవంబరు 1వ తేదీలోగా సర్వే పూర్తిచేసే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులు సాగు చేసిన పంటల వివరాలను పూర్తిస్థాయిలో ఏఈవో యాప్‌తో పాటు డిజిటల్‌ క్రాప్‌ సర్వే యాప్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లాలో 260 గ్రామపంచాయతీలు ఉండగా, 115 గ్రామాల్లో డీజిటల్‌ క్రాప్‌ సర్వే చేస్తున్నారు. ప్రతి క్లస్టర్లులో ప్రతి రైతును యూనిట్‌గా తీసుకొని వారి వివరాలను నమోదు చేస్తారు. అదేవిధంగా సాగుచేసిన పంటల ఫోటోలను యాప్‌లో అప్లోడ్‌ చేస్తారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. జిల్లాలో సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెల వరకు సర్వే చేస్తారు. నవంబరు 3వ తేదీన గ్రామపంచాయతీలో రైతుల పేర్లు వారు వేసిన పంటల వివరాలను ప్రదర్శిస్తారు. 8వ తేదిన రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, నవంబరు 11న అభ్యంతరాలను పరిశీలించి 13వ తేదీన తుది వివరాలను ప్రభుత్వానికి అందిస్తారు. క్రాప్‌ బుకింగ్‌ సర్వే ద్వారా పంటల దిగుబడి వచ్చే నాటికి రైతులు ఏ పంటలు వేసారనే కచ్చితంగా వివరాలు రావడంతో పాటు పంటల దిగుబడి సంబంధించిన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. వానాకాలం సీజన్‌కు సంబంధించి ఖచ్చితమైన పంటల సాగు వివరాలు ప్రభుత్వానికి అందడం ద్వారా వ్యవసాయానికి సంబంధించిన సంక్షేమ పథకాలను అందించడంలోనూ దోహదపడుతుందని భావిస్తున్నారు.

ఫ జిల్లాలో 2.35 లక్షల ఎకరాల్లో పంటల సాగు

వానాకాలం సీజన్‌కు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2,35,330 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనాలు వేశారు. వరి 1,84,310 ఎకరాలు, మొక్కజొన్న 3,748 ఎకరాలు, పత్తి 46,485 ఎకరాలు, కందులు 660 ఎకరాలు, పెసర 30 ఎకరాలు, ఇతర పంటలు 137 ఎకరాల్లో సాగు చేశారు. జిల్లాలో 2.35 లక్షల ఎకరాల్లో సాగుకు సంబంఽధించి మండలాల్లో గంభీరావుపేట మండలంలో 18,598 ఎకరాల్లో సాగు కాగా, ఇల్లంతకుంటలో 36,970 ఎకరాలు, ముస్తాబాద్‌లో 23,835 ఎకరాలు, సిరిసిల్ల 5,623 ఎకరాలు, తంగళ్లపల్లి 21,086 ఎకరాలు, వీర్నపల్లి 8,300 ఎకరాలు, ఎల్లారెడ్డిపేట 21,100 ఎకరాలు, బోయినపల్లి 19,167 ఎకరాలు, చందుర్తి 21,367 ఎకరాలు, కోనరావుపేటలో 23,140 ఎకరాలు, రుద్రంగి 10,964, వేములవాడ 10,038 ఎకరాలు, వేములవాడ రూరల్‌ 15,142 ఎకరాల్లో సాగు చేశారు.

ఫ జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి సాగు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం సీజన్‌లో ప్రధాన పంటలుగా వరి, పత్తి సాగు వైపే మొగ్గు చూపారు. జిల్లాలో వరి 1.84 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. జిల్లాలో వరి సాగులో గంభీరావుపేటలో 18,500 ఎకరాల్లో నాట్లు వేసుకోగా, ఇల్లంతకుంటలో 24,000 ఎకరాలు, ముస్తాబాద్‌లో 23,000 ఎకరాలు, సిరిసిల్లలో 4,800 ఎకరాలు, తంగళ్లపల్లిలో 20,100ఎకరాలు, వీర్నపల్లిలో8,000 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 17,500 ఎకరాలు, బోయినపల్లిలో 12,600 ఎకరాలు, చందుర్తిలో 15,100 ఎకరాలు, కోనరావుపేట 18,300ఎకరాలు, రుద్రంగిలో 5,910 ఎకరాలు, వేములవాడలో 5,200 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 11,300 ఎకరాల్లో వరి సాగు జరిగింది.. పత్తి సాగు జిల్లాలో 46,385 ఎకరాల్లో విత్తనాలు వేసుకున్నారు. ఇందులో గంభీరావుపేటలో 85 ఎకరాలు, ఇల్లంతకుంటలో 12,000 ఎకరాలు, ముస్తాబాద్‌లో 530 ఎకరాలు, సిరిసిల్లలో 800 ఎకరాలు, తంగళ్లపల్లిలో 870 ఎకరాలు, వీర్నపల్లిలో 300 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 3,600 ఎకరాలు, బోయినపల్లిలో 6,400ఎకరాలు, చందుర్తిలో 6,200 ఎకరాలు, కోనరావుపేట 4,800 ఎకరాలు, రుద్రంగిలో 2,200ఎకరాలు, వేములవాడలో 4,800 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 3,800 ఎకరాల్లో విత్తనాలు వేసుకున్నారు. వీటికి సంబంధించిన క్రాప్‌ బుకింగ్‌ చేసున్నారు.

Updated Date - Sep 03 , 2025 | 01:08 AM