కుదిరిన ఒప్పందం.. టెక్స్‌టైల్ కార్మికుల సమ్మె విరమణ
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:21 AM
కూలి పెంపు ఒప్పందంతో టెక్స్‌టైల్ పార్కు కార్మికులు చేస్తున్న సమ్మె విరమించారు.
తంగళ్లపల్లి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కూలి పెంపు ఒప్పందంతో టెక్స్‌టైల్ పార్కు కార్మికులు చేస్తున్న సమ్మె విరమించారు. బుధవారం మండలంలోని బద్దనపల్లి టెక్స్‌టైల్ పార్కులో చేనేత జౌళి శాఖ ఏడీ కార్మి కుల డిమండ్లపై యజమానులు, కార్మికసంఘ నాయకులతో చర్చలు జరి పారు. ప్రభుత్వ వస్త్రానికి ప్రస్తుతం ఇస్తున్న కూలి గిట్టుబాటు అవ్వడంలేద ని మీటరుకు రూ.1 పెంచాలని చర్చలో కార్మిక సంఘ నాయకులు డిమాం డ్ చేశారు. యజమానులు 50 పైసలు మాత్రమే చెల్లిస్తామని తేల్చి చెప్పా రు. దీంతో కార్మిక సంఘం నాయకులు చర్చల నుంచి నిష్క్రమించారు. చేనే త జౌళి శాఖ కమిషనర్, జాయింట్ డైరెక్టర్‌లు కార్మిక సంఘ నాయకులతో పోన్ ద్వారా చర్చించి ప్రభుత్వ వస్త్రానికి 65పైసలు పెంచే విధంగా చూస్తా మని హమీ ఇచ్చారని. అలాగే వారం రోజుల్లోపు టెక్స్‌టైల్ పార్కు కార్మికుల సమస్యలపై ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి చర్చించి పరిష్కరించే వి ధంగా చర్యలు తీసుకుంటామని వివరించినట్లు కార్మిక సంఘం నాయకులు తెలిపారు. సమావేశంలో త్రిప్ట్, 10శాతం యారన్ సబ్సిడీ డబ్బులు కార్మికు ల ఖాతాల్లో జమ అయ్యేలా చూస్తామని సమ్మె విరమించాలని కోరారు. అలాగే ప్రైవేట్ వస్త్రానికి నెలరోజుల్లోపు కూలి పెంచి ఒప్పందం జరిపించే లా చర్యలు తీసుకుంటామని సమ్మె విరమించాలని చేనేత జౌళి శాఖ ఉన్న తాధికారులు హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభు త్వ వస్త్రానికి మీటరుకు 65పైసలు చెల్లిస్తామని యజమానులు, అధికారు లు ప్రకటించడంతో సమ్మె విరమించారు. చేనేత జౌళిశాఖ ఏడీ రాఘవులు, యజమానుల సంఘం అధ్యక్షుడు అన్నల్‌దాస్ అనిల్, పవర్‌లైం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్, జిల్లా అధ్యక్షుడు కోడం ర మణ,పార్క్ యూనియన్ అధ్యక్షుడు కూచన శంకర్, శ్రీరాముల రమేష్ చం ద్ర, సంపత్, శ్రీకాంత్, అంజనేయులు, శ్రీనివాస్, అంబదాస్, రమేష్, నర్స య్య, చేనేతజౌళి శాఖ అధికారులు, యజమానులు, కార్మికులు పాల్గొన్నారు.