Share News

ముందస్తు కోటా

ABN , Publish Date - May 31 , 2025 | 12:45 AM

ఒకేసారి మూడు నెలల (జూన్‌, జూలై, ఆగస్టు)కు సంబం ధించిన రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. జూన్‌ ఒకటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ముందస్తు కోటా

- జూన్‌ నెలలో ఒకేసారి మూడు నెలల రేషన్‌

- పంపిణీకి అధికార యంత్రాంగం సన్నద్ధం

- గోదాంల నుంచి రేషన్‌ దుకాణాలకు బియ్యం తరలింపు

- జూన్‌ ఒకటి నుంచి 30 వరకు సరఫరా

- జిల్లాలో 3,18,732 రేషన్‌ కార్డులు... 9,50,406 మంది లబ్ధిదారులు

- ప్రతినెలా ఇచ్చేది 1,79,60,709 కిలోలు

జగిత్యాల, మే 30 (ఆంధ్రజ్యోతి): ఒకేసారి మూడు నెలల (జూన్‌, జూలై, ఆగస్టు)కు సంబం ధించిన రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. జూన్‌ ఒకటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే మన రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. క్షేత్ర స్థాయిలో వచ్చే సమస్యలను అధిగమించి మూడు నెలల కోటా ఒకే సారి ఇచ్చేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తు న్నారు. ఈ విషయమై కలెక్టర్‌ సత్య ప్రసాద్‌, అడిష నల్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) బీఎస్‌ లత, పౌర సరఫరాలశాఖ అధికారులతో చర్చించారు. అనం తరం క్షేత్రస్థాయి అధికారులు, డీలర్లతో వీడియో కాన్ఫ రెన్స్‌ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశిం చారు. సాధారణంగా నెలలో 15 రోజులు మాత్రమే బియ్యం పంపిణీ చేసేవారు. ప్రస్తుతం ఒకేసారి మూడునెలల కోటా ఇస్తున్నం దున గడువుతో సంబంధం లేకుండా లబ్ధిదారులు తీసుకెళ్లే వరకు పంపిణీ చేయాలని నిర్ణయించారు.

సమస్యలు అధిగమిస్తేనే...

ప్రభుత్వం మూడునెలల రేషన్‌బియ్యం ఒకే నెల లో పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో పలు సమస్యలు ఎదురు కానున్నాయి. గతంలో కోవిడ్‌ సమయంలో మాత్రమే ఒకేసారి రెండు నెలలకోటా ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో ఒకటి లేదా రెండు నెలల కోటాను పంపిణీ చేసేందుకు మెకా నిజం ఉండగా మూడు నెలల కోటా ఒకేసారి పంపి ణీ చేయాలంటే మాత్రం పలు సమస్యలను అధిగ మించాల్సి ఉంది. కోటానిల్వకు సరిపడా గోదాము లను సమకూర్చు కోవాల్సి ఉంది. ఇదే సమయంలో గ్రామాల్లో

డీలర్ల దగ్గర కూడా మూడు నెలల కోటా ఒకేసారి నిల్వ చేయటానికి సరిపడా స్థలాలు లేకపోవటం కూడా సమస్య కానుంది. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బియ్యం వచ్చినట్లుగా గ్రామాలకు చేరవేయటం ద్వారా గోదాముల కొరతను అధిగమించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగే నెలలో 15 రోజులు కాకుండా నెల మొత్తం బియ్యం పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

- జిల్లాలో 3,18,732 రేషన్‌కార్డులు...

జిల్లాలో వానాకాలం సీజన్‌ సుమారు 4.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా యాసంగిలో 3.50 లక్షల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. రేషన్‌ దుకాణాల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేసే సమయంలో జిల్లాలో పండిన వడ్ల ద్వారా సీఎంఆర్‌ రూపంలో సేకరించినవి సరిపోయేవి. ప్రస్తుతం సన్న బియం ఇస్తున్నందున జిల్లాలో వచ్చే దిగుబడి సరిపోవడం లేదు. కొనుగోలు కేంద్రాలకు ఐదు నుంచి పది శాతానికి మించి సన్నరకం వడ్లు రావడం లేదు. ఇవి కేవలం మూడు నెలలకు మాత్రమే సరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకేసారి మొత్తం బియ్యం ఇచ్చేస్తే ఆ తర్వాత పంపిణీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 3,18,732 కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతి నెలా 1,79,60,709 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒకేసారి మూడు నెలల కోటా బియ్యం అంటే 5,38,82,127 కిలోల అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు పండించిన సన్నరకం వడ్లను ఎక్కువ శాతం బహిరంగ మార్కెట్‌లోనే విక్రయిస్తున్నారు. దీంతో సన్న బియ్యం కోసం పక్క జిల్లాలపై ఆధారపడక తప్పడం లేదు. ప్రస్తుతం మూడు నెలల కోటాకు సంబంధించి సన్న బియ్యం సరఫరా చేయడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.

అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం...

- జితేందర్‌ రెడ్డి, జిల్లా సివిల్‌ సప్లయి అధికారి

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకేసారి మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. లబ్ధిదారులకు మూడు నెలలకు కోటా బియ్యం అందజేస్తాం. ఇప్పటికే క్షేత్ర స్థాయి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశాము. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాము.

Updated Date - May 31 , 2025 | 12:45 AM