Share News

పంటలకు సరిపడా యూరియా నిల్వ..

ABN , Publish Date - Aug 20 , 2025 | 01:00 AM

జిల్లాలో యూరియా కొరత లేద ని, పంటలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెం దవద్దని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా కోరారు.

పంటలకు సరిపడా యూరియా నిల్వ..

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యూరియా కొరత లేద ని, పంటలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెం దవద్దని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా కోరారు. పంటలను సాగు చేసిన రైతులు యాజమాన్య పద్ధతులతోనే యూరియాను వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో మంగళవారం జిల్లాలోని వ్యవసాయ అధికా రులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించి రైతులు సాగుచేసిన పంటల విస్తీర్ణం, యూరియా నిల్వలు, విక్రయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డారు. జిల్లాలో అయా పంటల సాగుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు యూరి యా స్టాక్‌ను తెప్పిస్తున్నామని సృష్టం చేశారు.యూరియా విషయమై రైతులు అందోళన చెందవద్దని సూచించారు. వ్యవసాయా శాఖ అధికారులు అప్రమ త్తంగా ఉండాలని తమ మండలాలకు వచ్చే ఎరువులను రైతుల పంటల సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులను అందించాలన్నారు. రైతులు తమకు అవసరమైన ఎరువులు మాత్రమే తీసుకోవాలని సూచించారు. వ్యవసాయశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎరువులు పక్క దారి పట్టకుండా చూడా లని అన్నారు. రైతులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని రైతులు యాజ మాన్య పద్ధతులను పాటించి ఎరువులు వినియోగించుకునేలా అవగాహన కల్పిం చాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని సొసైటీలు, ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా అందుబాటులో ఉంటుందన్నారు. వీడియోకాన్ఫ రెన్స్‌లో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌ బేగం, ఏడీఏలు, ఏవోలు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2025 | 01:00 AM