Share News

మెరుగైన బోధనకు కార్యాచరణ

ABN , Publish Date - May 21 , 2025 | 12:39 AM

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల కు మెరుగైన విద్యనందించేందుకు పటిష్ట కార్యాచరణ రూపొందించాల ని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు.

మెరుగైన బోధనకు కార్యాచరణ

సిరిసిల్ల, మే 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల కు మెరుగైన విద్యనందించేందుకు పటిష్ట కార్యాచరణ రూపొందించాల ని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. మంగళవారం సిరిసిల్లలోని గీతానగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుల కు నిర్వహిస్తున్న ఐదు రోజుల వేసవి శిక్షణ కార్యక్రమ శిబిరాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ స్వయంగా పలు సబ్జెక్ట్‌లపై శిక్షణలోని అంశాలను బోధించారు. ఈ సందర్భంగా సందీప్‌కుమార్‌ ఝా మాట్లాడుతూ పిల్లలు గణితం. ఏఐ టూల్స్‌లో వెనకబడకుండా వినూత్న పద్ధతులలో వారికి అర్థమయ్యేలా బోధన సాధించాల న్నారు. నూతనబోధన పద్ధతులు పిల్లలకు బోధించే సమయం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.విద్యార్థులు నిత్యం పాఠశాలకు హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు పర్యవేక్షించా లని పిల్లలు గణిత పరిజ్ఞానంపై అధిక దృష్టి సాధించే విధంగా దృష్టి సారించాలని, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పె ట్టాలన్నారు. గణితంలోని వివిధ కాన్సెప్ట్‌లపై ఎక్కువ ప్రశ్నలు అభ్యాసన చేయించాలని, వివిధ సమస్యలను ఎలా పరిష్కరిం చాలో విద్యార్థులు స్వయంగా ప్రయత్నించేలా ప్రొత్సహించాలని అన్నారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించినప్పటికి ఇంటర్‌లో అధికంగా వైఫల్యం చెందుతున్నారన్నారు. విద్యార్థుల ను ముందునుంచే బలోపేతం చేస్తే వైఫల్యాలను నిరోధించవచ్చని అన్నారు. సమాజంలో మంచి పునాది ఉండాలంటే మంచి విద్యార్థుల ను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఉపాధ్యాయులు ఐదు రోజుల పాటు వివిధ అంశాల్లో శిక్షణ అందుకోని చిత్త శుద్ధితో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అఽధికారి జనార్థన్‌రావు ఉన్నారు.

Updated Date - May 21 , 2025 | 12:39 AM