Share News

సకాలంలో సీఎంఆర్‌ అప్పగించకపోతే చర్యలు

ABN , Publish Date - Jul 05 , 2025 | 12:44 AM

సకాలంలో సీఎంఆర్‌ చెల్లింపులు జరగకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ అన్నారు.

సకాలంలో సీఎంఆర్‌ అప్పగించకపోతే చర్యలు
జగిత్యాలలో అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌

- కలెక్టర్‌ సత్య ప్రసాద్‌

జగిత్యాల, జూలై 4 (ఆంధ్రజ్యోతి): సకాలంలో సీఎంఆర్‌ చెల్లింపులు జరగకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో 2023-24 యాసంగి, 2024-25 యాసంగి సీజన్‌లకు సంబంధించి సీఎంఆర్‌ చెల్లింపులపై రైస్‌ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడారు. 2023-24 యాసంగి సీజన్‌కు సంబంధించి సీఎంఆర్‌ చెల్లింపులకు ప్రభుత్వం నిర్ధేశించిన గడువు ఈనెల 27వ తేదీలోగా వంద శాతం పూర్తి చేయాలన్నారు. నిర్ణీత గడువులోపు సీఎంఆర్‌ అప్పగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి జితేందర్‌ రెడ్డి, జిల్లా సివిల్‌ సప్లయి కార్పోరేషన్‌ మేనేజర్‌ జితేంద్ర ప్రసాద్‌, పలువురు ఫారాబాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు, రా రైస్‌ మిల్లర్లు, మిల్లర్ల అసోసియేషన్‌ నాయకులు, సివిల్‌ సప్లయి, సివిల్‌ సప్లయి కార్పోరేషన్‌ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రతపై అప్రమత్తంగా ఉండాలి

జగిత్యాల అర్బన్‌: ప్రజలు పరిసరాల పరిశుభ్రత పై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ బి సత్యప్రసాద్‌ సూచించారు. శుక్రవారం డ్రై డేను పురస్కరించుకుని పట్టణంలోని 11వ వార్డు అమీనాబాద్‌లో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ ఆరోగ్య కార్యకర్తలు, ఆశావర్కర్లు ఇంటింటి సర్వే చేపట్టాలని, ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు ఉండ కుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌, ఆర్డీవో మధుసూదన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ స్పందన, అసిస్టెంట్‌ మలేరియా అధికారి సత్యనారా యణ, వైద్యాధికారి చైతన్య రాణి శ్రీధర్‌, మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 12:44 AM