అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్య తీసుకోవాలి
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:22 AM
భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై సిద్దిపేట పట్ట ణానికి చెందిన న్యాయవాదులు సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యా ఖ్యలు చేయడాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదులు ఖండించారు.
సిరిసిల్ల క్రైం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై సిద్దిపేట పట్ట ణానికి చెందిన న్యాయవాదులు సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యా ఖ్యలు చేయడాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదులు ఖండించారు. సదరు న్యాయవాదులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ మహే ష్ బి.గితేకు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తంగళ్లపల్లి వెంకటి మాట్లా డుతూ సిద్దిపేట బార్ అసోసియేషన్‌లోని న్యాయవాదులు ప్రధాన న్యాయ మూర్తిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వారిపై ఎస్సీఎస్టీ అట్రా సిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారిని బార్ కౌన్సిల్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమావేశంలో వేములవాడ, సిరిసిల్ల బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గుడిసె సదా నందం, ధర్మేందర్, సీనియర్ న్యాయవాదులు న్యాయవాదులు కుంట శ్రీని వాస్, చంటి సుజీవన్, వాతపు మౌళి, నర్మెట రమేష్, అల్లూరి చంద్రశేఖర్, మునిగే రాజు, రాగుల కరుణాకర్, కే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.