Share News

న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:39 AM

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూ ర్తిపై బూటు విసిరి అవమానించిన న్యాయవాదిపై చట్టరీత్య చర్యలు తీసుకోవా లని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు నీరటి శ్రీనివాస్‌ అన్నారు.

న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలి

సిరిసిల్ల టౌన్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూ ర్తిపై బూటు విసిరి అవమానించిన న్యాయవాదిపై చట్టరీత్య చర్యలు తీసుకోవా లని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు నీరటి శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాంతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా దళితులపై కుల వివక్ష చూపుతూ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. భారత రాజ్యాంగం ద్వారా నిర్మితమైన దేశ అత్యుత్తమ న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తికి, ఐఏఎస్‌ అధికా రులకు కూడా రక్షణ లేదన్నారు. దేశ రాజకీయాలు, ఉద్యోగాల్లో దళితులు కుల వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారన్నారు. దళితులపై కులవివక్ష చూపిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు, ఉపాధ్యక్షుడు బాలరాజు, నియోజకవర్గం ఇన్‌చార్జి రాజ్‌కుమార్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాలుక సత్యం, రాష్ట్ర కార్యదర్శి రొడ్డ రాంచంద్రం, పట్టణ అధ్యక్షుడు పండుగ శేఖర్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 12:39 AM