Share News

మత్స్యకారులకు ప్రమాద బీమా తోడ్పాటు..

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:22 AM

మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ప్రమాద బీమా ఎంతో తోడ్పాటును అందిస్తుందని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

మత్స్యకారులకు ప్రమాద బీమా తోడ్పాటు..

సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ప్రమాద బీమా ఎంతో తోడ్పాటును అందిస్తుందని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో శుక్రవారం పలువురికి ప్రమాద బీమా ధ్రువీకరణ పత్రాలను ఇన్‌చార్జి కలెక్టర్‌ అందజేశారు. కోనరా వుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన కూన తిరుపతి ప్రమాదవ శాత్తు మృతిచెందాడు, దీంతో అతడి భార్య కూన లావణ్యకు, గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్‌ గ్రామానికి చెందిన కుంట రమేష్‌ ప్రమాదవ శాత్తు చనిపోవడంతో అతడి తల్లి కుంట మల్లవ్వకు బ్యాంక్‌ ఖాతాల్లో ప్రధా న మంత్రి సంపద యోజన పథకం కింద గ్రూప్‌ ప్రమాద బీమా కింద రూ 5లక్షల చొప్పున ఇద్దరికి జమకావడంతో ఆ పత్రాలను ఇద్దరి కుటుంబీకులకు అందజేశారు. ఈసందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లాడుతూ మత్స్యకారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు మ మిండ్ల అంజయ్య, చింతకింది పోచయ్య, కార్యదర్శి సంతోష్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2025 | 12:22 AM