Share News

ఆధార్‌ కార్డులు అప్‌డేట్‌ చేసుకోవాలి

ABN , Publish Date - Jul 10 , 2025 | 01:02 AM

జిల్లాలోని ప్రతీ ఒక్కరు ఆధార్‌ కార్డులో వివరాలు, బయోమెట్రిక్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఎస్పీ మహేష్‌బీగీతే కోరారు.

ఆధార్‌ కార్డులు అప్‌డేట్‌ చేసుకోవాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రతీ ఒక్కరు ఆధార్‌ కార్డులో వివరాలు, బయోమెట్రిక్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఎస్పీ మహేష్‌బీగీతే కోరారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం ఆధార్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భం గా వారు మాట్లాడుతూ సంతృప్తి పద్ధతిలో పౌరులందరికి తప్ప నిసరిగా ఆధార్‌కార్డు జారీచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే ప్రసవాల వివరాలు ఈ బర్త్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని కోరారు. ప్రతి 10వేల జనా భాకు ఒక సీఎస్‌సీ సెంటరలను ఏర్పాటు చేయాలని వారంలో అదనంగా మరో 36 సీఎస్‌సీ సెంటర్‌ల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని, ప్రస్తుతం ఉన్న కొన్ని సెంటర్‌లను మార్చాలని సూచించా రు. జిల్లాలో 5నుంచి 15 సంవత్సరాలలోపు గల 27వేలకుపైగా ఉన్న జనాభాకు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేయించాలని కోరారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆధార్‌బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ కోసం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన క్యాంపులను ప్రతి 6నెలలకు ఒకసారి ఏర్పాటుచేయాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమాధికారి మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఆ ధార్‌ కార్డులు అందేలా చూడాలన్నారు. 18సంవత్సరాలు దాటిన వారికి అధార్‌ నమోదుకు సంబంధించి తహసీల్థాఽర్‌ లాగిన్‌లో పెండింగ్‌ దర ఖాస్తులను పరిష్కారించాలని కోరారు. మండల కేంద్రాల్లో ఆధార్‌కార్డు వివరాల అప్‌డేట్‌ చేసేందుకు ప్రత్యేక క్యాంపుల ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను తయారుచేయాలని అదేశించారు. జిల్లాలో మీ సేవా కేం ద్రాల్లో అధార్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోస్టల్‌ కార్యాలయం నుంచి ఎన్ని అధార్‌కార్డులు తప్పుడు అడ్రాస్‌ల కారణంగా వెనక్కి వచ్చాయో వివరాలు అందించాలన్నారు. జిల్లాలోని వివిధ అనాధ శరణాలయాల్లో పెరుగుతున్న వారికి అధార్‌ ఎన్‌రో ల్మేంట్‌లో వచ్చే సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశం లో యూఐడీఏఐ ప్రాజెక్టు మేనేజర్‌ నరేష్‌చంద్ర, జిల్లా సంక్షేమాఽధికారి లక్ష్మీరాజం, జిల్లా విద్యాశాఖ అధికారి వినోద్‌కుమార్‌, జిల్లా వైద్యా ఆరో గ్యశాఖ అధికారి డాక్టర్‌ రజిత, ఈడిఎం శ్రీనివాస్‌, లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ మల్లిఖార్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 01:02 AM