Share News

ఉక్కు మనిషికి ఘన నివాళి

ABN , Publish Date - Nov 18 , 2025 | 12:01 AM

ఉక్కు మనిషి సర్ధార్‌ వల్లభాయి పటేల్‌ జయంతి సందర్భంగా నగరంలో యువత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌, జిల్లా అధికారులు ఘన నివాళి అర్పించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖకు చెందిన మైభారత్‌ కరీంనగర్‌ జిల్లా ఆధ్వర్యంలో యూనిటీ మార్చ్‌ సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఉక్కు మనిషికి ఘన నివాళి
నగరంలో యునిటీ మార్చ్‌ పాదయాత్రలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండిసంజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీలు మల్కకొమురయ్య, అంజిరెడ్డిలు

భగత్‌నగర్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఉక్కు మనిషి సర్ధార్‌ వల్లభాయి పటేల్‌ జయంతి సందర్భంగా నగరంలో యువత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌, జిల్లా అధికారులు ఘన నివాళి అర్పించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖకు చెందిన మైభారత్‌ కరీంనగర్‌ జిల్లా ఆధ్వర్యంలో యూనిటీ మార్చ్‌ సోమవారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎస్సారార్‌ కళాశాల నుంచి కళాభారతి వరకు మార్చ్‌ జరిగింది. పాదయాత్రలో విద్యార్థులంతా దేశ భక్తి నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చిన్నమైల్‌ అంజిరెడ్డి, మల్క కొమురయ్య, కలెక్టర్‌ పమేలా సత్పతి, సీపీ గౌస్‌ ఆలం, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, డిస్ట్రిక్ట్‌ యూత్‌ ఆఫీసర్‌ వెంకట్‌రాంబాబు, బి రవీందర్‌, జి శ్రీనివాస్‌, మాడ వెంకట్‌రెడ్డి, డి సంపత్‌, ఎస్సారార్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామకృష్ణ, ఇంటర్మీడియేట్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ గంగాధర్‌, డీవైఎస్‌వో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఫ దేశాన్ని పట్టి పీడిస్తున్న కుటుంబ వారసత్వ రాజకీయాలు

- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌

కరీంనగర్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దేశాన్ని కుటుంబ వారసత్వ రాజకీయాలు పట్టి పీడిస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. సర్ధార్‌ వల్లభాయి పటేల్‌ 150 జయంతి ఉత్సవాల నేపథ్యంలో నగరంలో నిర్వహించిన యూనిటీ మార్చ్‌ అనంతరం విలేకరులతో మాట్లాడారు. సర్ధార్‌ వల్లభాయి పటేల్‌ ఆశయాలను నెరవేర్చేందుకు నేటి యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. భారత దేశ ఐక్యత కోసం తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మహనీయుడు సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అన్నారు. పటేల్‌ లేక పోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదన్నారు. భారత దేశ ఐక్యత కోసం తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మహానీయుడు వల్లభాయి పటేల్‌ అన్నారు. దేశంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ వ్యవస్థను స్థాపించడంలో పటేల్‌ కీలక పాత్ర పోషించారన్నారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 31 నుంచి నవంబరు 25 వరకు అన్ని జిల్లాల్లో సర్దార్‌ ఐక్యత మార్చ్‌ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.

Updated Date - Nov 18 , 2025 | 12:01 AM