సీతారాం ఏచూరికి ఘన నివాళి
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:46 AM
జిల్లా కేంద్రంలోని అమృత్ లాల్ శుక్లా కార్మిక భవనంలో సీపీఎం ఆధ్వర్యంలో సీపీఎం అగ్రనాయకుడు సీతా రాం ఏచూరి ప్రథమ వర్ధంతిని నిర్వహిం చారు.
సిరిసిల్ల టౌన్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని అమృత్ లాల్ శుక్లా కార్మిక భవనంలో సీపీఎం ఆధ్వర్యంలో సీపీఎం అగ్రనాయకుడు సీతా రాం ఏచూరి ప్రథమ వర్ధంతిని నిర్వహిం చారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి నాయకులు పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడారు. భారత రాజకీయ రంగంలో కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు యోధుల్లో సీతారాం ఏచూరి ఒకరని అన్నారు. రాజ్యాంగ రక్షణ కోసం ఆయన అనేక ఉద్యమాలు నడిపాడని మతోన్మాద శక్తులు దేశంలో కులమతాల ప్రాతిపదికన ప్రజలను విడగొట్టే ప్రయత్నాలు చేస్తే ఏచూరి ఐక్య పరుస్తూ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలకు రూపకల్పన చేశారని అన్నారు. ఏచూరి మరణం సీపీఎంకు తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, రమేష్‌చంద్ర, నక్క దేవదాస్, సందు పట్ల పోచమల్లు పాల్గొన్నారు. అలాగే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి నాయకులు నివాళుల ర్పించారు. జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, కమిటీ సభ్యులు కడారి శివ, ముబారక్, సాయి, రషీద్, జశ్వంత్, నవీన్, నయిం, సాయి, భరత్ తదితరులు పాల్గొన్నారు.