మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘన నివాళి
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:14 AM
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని శుక్రవారం పట్టణంలోని గాంధీచౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని శుక్రవారం పట్టణంలోని గాంధీచౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి నాయ కులు పూలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ కో ఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుబాల వెంకటేశం, నాయ కులు గోలి వెంకటరమణ, గుజ్జె రమేష్, ఎండీ అహ్మద్, లక్ష్మన్, భాను, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఇల్లంతకుంట : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలకేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండలకాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నియోజకవర్గ అధికారి ప్రతినిధి పసుల వెంకటి, ఏఎమ్‌సీ ఉపాధ్యక్షుడు ప్రసాద్, ఏఎమ్‌సీ డైరెక్టర్లు మచ్చ రాజేశం, అల్లెపు రజనీకాంత్, తాట్ల వీరేశం, సురేందర్‌రెడ్డి, నాయకులు జమాల్, వర్కోలు మల్లయ్య, రవి, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎల్లారెడ్డిపేట : మాజీ ప్రధాని, స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి ని మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మండల శాఖ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, నాయకులు గౌస్, రాజేందర్, మహేందర్, సతీష్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.
ఫ గంభీరావుపేట : మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందరాగాంధీ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జీ గౌరిశంకర్, నాయకులు అక్కపల్లి బాలయ్య, బంగ్ల రాజు. దేశెట్టి రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
ఫ తంగళ్లపల్లి : ఇందిరగాంధీ వర్ధంతిని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జల్గం ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న క్రమంలో హైదరాబాద్ లో నిర్వహించినట్లు పేర్కోన్నారు. జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అకునూరి బాలరాజ్, సోషల్ మీడియా ఇన్‌చార్జి గడ్డం మధుకర్, మా ర్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆరపెల్లి బాలు, పొన్నాల పర్శరాములు, నర్సయ్య, అసరీ బాలరాజ్, గుగ్గిళ్ల భరత్, ఎడ్ల తిరుపతి, బాలసాని శ్రీనివాస్, గదారీ కిషన్, మీరాల శ్రీనివాస్ యాదవ్ తదితరలు పాల్గొన్నారు.
ఫ కోనరావుపేట : మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహిం చారు. ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు చేపూరి గంగాధర్, లింబయ్య, రమే ష్‌రెడ్డి, దేవరకొండ చారి, గొట్టె శంకర్ తదితరులు పాల్గొన్నారు.