భగత్‌సింగ్‌కు ఘన నివాళి
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:58 PM
భగత్‌సింగ్ జయంతి సందర్భంగా 362వ బూత్‌లో బీజేపీ నాయకులు ఆదివారం ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
భగత్‌నగర్, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): భగత్‌సింగ్ జయంతి సందర్భంగా 362వ బూత్‌లో బీజేపీ నాయకులు ఆదివారం ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్‌రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, ఖచ్చు మధు, బొంగోని పర్శరాములు, శీతల రమేష్‌చంద్ర, బండ రాకేష్, చంద్రగిరి వేణు,ఈరెడ్డి తిరుమల్‌రెడ్డి, ఆబిడి మాధవరెడ్డి పాల్గన్నారు.
ఫ బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో భగత్‌నగర్ చౌరస్తాలో భగత్‌సింగ్ విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పూల మాల వేసినివాళులు అర్పించారు మాజీ మేయర్ సునీల్‌రావు, నాంపల్లి శ్రీని వాస్, రాజు, గుంజేటి శివ, గాయత్రీదేవి పాల్గొన్నారు.
ఫ ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు.
ఫ ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేందర్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు.
కరీంనగర్ అర్బన్: భగత్‌సింగ్ స్ఫూర్తితో యువత తమ లక్ష్యాలను సాధించాలని మాజీ మేయర్, రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ అన్నారు. భగత్‌సింగ్ జయంతి సందర్భంగా ఆదివారం భగత్‌నగర్‌లోని విగ్రహం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరతమాత స్వేచ్ఛ కోసం ఉరికంబాన్ని ఆనందంగా ముద్దాడిన వీరతేజంగా కొనియాడారు.
హుజూరాబాద్: హుజూరాబాద్ పట్టణంలో ఏఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ 118వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రోహిత్, గణేష్, రాధాకృష్ణ, రాజు, సాయికిరణ్ పాల్గొన్నారు.