ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందడుగు
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:40 AM
రాష్ట్ర ప్రజలను ఆకాంక్షలను నెరవేర్చే దిశగా సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుందని కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కెకె మహేందర్‌రెడ్డి పేర్కొ న్నారు.
ముస్తాబాద్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలను ఆకాంక్షలను నెరవేర్చే దిశగా సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుందని కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కెకె మహేందర్‌రెడ్డి పేర్కొ న్నారు. మండలంలోని చీకోడ్ గ్రామంలో మాజీ సర్పంచ్, బీఆర్‌ఎస్ నాయ కుడు కాంపెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు గ్రామస్థులు కెకె మహేంద ్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాకప్పుకొని పార్టీలో చేరారు. ఈసం దర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కెకె మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లులేని ఊరు లేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎం త ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా ముందడుగు లు వేస్తుందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ చేసిన అవినీతితో అప్పుల కుప్పగా చేసిన తెలంగాణా రాష్ట్రాన్ని మెల్లమెల్లగా గాడిలోకి తెచ్చే యత్నం చేస్తున్నా రన్నారు. పేదలకు, కడుపేదలకు సేవ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభు త్వం పనిచేస్తుందని మహిళలకు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబాలు బ లోపేతమ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందన్నా రు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు కోకన్వీనర్ కనమేని చక్రధర్‌రెడ్డి, కాం గ్రెస్ పార్టీ సినియర్ నాయకులు కరెడ్ల కొండల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, కొప్పు రమేశ్, రాజ్‌కిరణ్‌రెడ్డి, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.