రాజాబహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:49 PM
కొత్వాల్ రాజ బహదూర్ వెంకట రామరెడ్డి విగ్రహాన్ని కలెక్టరేట్ చౌరస్తాలో ఏర్పాటు చేయాలని రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : కొత్వాల్ రాజ బహదూర్ వెంకట రామరెడ్డి విగ్రహాన్ని కలెక్టరేట్ చౌరస్తాలో ఏర్పాటు చేయాలని రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని లహరి బాంక్వెట్ హాల్‌లో జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొత్వాల్ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి జయంతిని పురస్కరించుకొని ప్రతిభా పురస్కారాల ప్రదాన మహోత్సవం ఘనంగా జరిగింది. పదవ తరగతిలో 24 మంది, ఇంటర్‌లో 13 మంది రాష్ట్ర, జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థినీ విద్యార్థులకు జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్య క్షుడు కృష్ణారెడ్డి, నాయకులు కొత్వాల్ రాజా బహదూర్ వెంక టరామ రెడ్డి ప్రతిభా పురస్కారాలతో పాటు బహుమతులను అం దించి అభినందించారు. అనంతరం సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెల్ముల స్వరూప తిరుపతిరెడ్డి, ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రశంసా పత్రాలను అందుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను నాయ కులు సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ పేద రెడ్డి బిడ్డలకు ఉన్నత విద్యను అందించడం కోసం వెంకటరామరెడ్డి వసతి గృహాలను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి దోహదపడ్డారని అన్నారు. ఆయన ఏర్పాటుచేసిన వసతి గృహాల నుంచి సినారె, రావి నారాయణరెడ్డి, చెన్నారెడ్డి వంటి గొప్ప వ్యక్తులు చైతన్యవంతులుగా ఎదిగారని అన్నారు. అన్ని రంగాలలో ఆయన చేసిన సేవలను మరవలేమని అంతటి గొప్ప వ్యక్తి విగ్రహాలు లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం కొత్వాల్ రాజా బహదూర్ వెంకట రామరెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు. పనికి మాలిన ఓ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా రెడ్డి లను అసభ్యకర వ్యాఖ్యల చేసి కించపరచాడని మరోసారి పునారా వృతం అయితే రెడ్డి సామాజిక వర్గం ఊరుకోదని హెచ్చరించారు. బీసీ నాయకులు వారివారి ఉద్యమాలను కొనసాగిస్తూనే రెడ్డి సామాజిక వర్గాన్ని గౌరవించారని అన్నారు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గం పార్టీలకు అతీతంగా ఉంటూ ఐక్యతను చాటాలన్నారు. భవి ష్యత్తులో మనకు మనమే పోటీ పడాలని, మంచి విజయాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజి రెడ్డి, జిల్లా కోర్ కమిటీ సభ్యులు పూర్మాణి లింగారెడ్డి, భానాపురం రంగారెడ్డి, న్యాలకొండ రాఘవరెడ్డి, పాతూరి మహేందర్‌రెడ్డి, పొన్నా ల బాల్‌రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల నాగిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎగుమామిడి కృష్ణారెడ్డి, మడుపు ప్రమోద రెడ్డి, సభ్యులు, వివిధ మండలాల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.