Share News

అన్ని వర్గాల వారికి సముచిత స్థానం

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:24 AM

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా సంస్థా గత నిర్మాణంలో అన్ని వర్గాలకు సముచితంగా స్థానం ఉంటుందని టీపీసీసీ అబ్జర్వర్లు అన్నారు.

అన్ని వర్గాల వారికి సముచిత స్థానం

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ పార్టీ జిల్లా సంస్థా గత నిర్మాణంలో అన్ని వర్గాలకు సముచితంగా స్థానం ఉంటుందని టీపీసీసీ అబ్జర్వర్లు అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా కాం గ్రెస్‌ కార్యవర్గంలో పదవుల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరిం చారు. టీపీసీసీ అబ్జర్వర్లు కృష్ణచైతన్యరెడ్డి, ఫక్రుద్దీన్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ శ్రేణుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అబ్జర్వర్లు కృష్ణచైతన్యరెడ్డి, ఫక్రుద్దీన్‌ మాట్లాడారు. టీపీసీసీ మార్గదర్శకాలతో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత పదవులకు మొత్తం 150 దర ఖాస్తులు వచ్చాయన్నారు. అన్ని వర్గాలకు సముచితంగా స్థానం కల్పిస్తామ న్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ, మహిళలకు అందరికీ జిల్లా కమిటీలో ప్రాతినిథ్యం ఉండేలా చూస్తామన్నారు. వచ్చిన దరఖాస్తులన్నింటిని స్కూృటినీ చేసి ఏ పదవులకు ఎవరు అర్హులో దానికి అనుకూలంగా వారి నియామకాలు చేపట్టాలని టీపీసీసీకి తాము నివేదికను సమర్పిస్తామన్నారు. తదనంతరం టీపీసీసీ నిర్ణయం ప్రకారం నియామకాలు జరుగుతాయన్నారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి పదవులను కేటాయిస్తారన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్‌ల ఎన్నికల్లో జిల్లాలో పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయని, రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పార్టీ శ్రేణులు సత్తాచాటాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, పట్టణ ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, వేములవాడ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షడు సాగరం వెంకటస్వామి, వేములవాడ మర్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, గొల్లపల్లి మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ సాహెదా బేగం, మాజీ కౌన్సిలర్‌ రాగుల జగన్‌, నాయకులు కొండూరి గాంధీరావు, రాపెల్లి కల్యా ణ్‌, ఎర్రం మల్లయ్య, నాలుక సత్యం, పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 12:24 AM